ఇంట్రెస్టింగ్.. అప్పుడు ‘కుర్చీ మడతపెట్టి’ ఇపుడు ‘దేవర’ సాంగ్ కి


ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా నుంచి పలు సాలిడ్ చార్ట్ బస్టర్ సాంగ్స్ వరుసగా పడుతున్నాయి. దాదాపు స్టార్ హీరోస్ అనే కాకుండా మిడ్ రేంజ్ హీరోస్ సినిమాలు చిన్న హీరోలు సినిమాల నుంచి కూడా పలు చార్ట్ బస్టర్ పాటలు పడుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మొదట నెగిటివ్ టాక్ తో వచ్చి కూడా ఇప్పుడు రికార్డు వ్యూస్ కొట్టిన సాంగ్స్ కూడా ఉన్నాయి.

మరి ఈ సాంగ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన “గుంటూరు కారం” (Guntur Kaaram) నుంచి కుర్చీ మడతపెట్టి అయితే ఒక వండర్ అని చెప్పాలి. ఈ సాంగ్ వచ్చిన వెంటనే యూనానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. థమన్ పై గట్టి నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యామని చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ సాంగ్ ఇప్పుడు 300 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తూ పబ్లిక్ చార్ట్ బస్టర్ అయ్యింది.

మరి ఈ సాంగ్ కి ఇపుడు వచ్చిన “దేవర” నుంచి చుట్టమల్లే సాంగ్ ఒక అంశం అయితే సింక్ అవుతుంది అని చెప్పాలి. కుర్చీ మడతపెట్టి వచ్చిన సాంగ్ లో ఒక దగ్గర ట్యూన్ అలా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘అత్తారింటికి దారేది’ లోని కాటమరాయుడా లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే తరహాలో దేవర రెండో సాంగ్ కి కూడా జరిగింది.

అనిరుద్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ లో కొన్ని చోట్ల శ్రీలంకన్ చార్ట్ బస్టర్ సాంగ్ ‘మణికె మగ హితే’ సాంగ్ లానే అనిపిస్తున్నట్టుగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అయితే గుంటూరు కారం సాంగ్ కి కూడా ఈ తరహాలోనే కామెంట్స్ వచ్చినప్పటికీ రికార్డు వ్యూస్ తో అది భారీ చార్ట్ బస్టర్ అయ్యింది. మరి ఈ తరహాలోనే దేవర సాంగ్ కూడా అలాంటి చార్ట్ బస్టర్ లా మారిపోతుందేమో చూడాలి మరి.

Exit mobile version