‘దేవర’ భార్య గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ పై చేస్తున్న కలెక్షన్ల విధ్వంసం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఐతే, ఇప్పుడు దేవర సినిమాలో.. దేవర పాత్రకి భార్యగా నటించిన నటి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఆమె ఎవరు ?, గతంలో ఏ సినిమాల్లో నటించింది ?, ముఖ్యంగా ఆమె స్రీన్ ప్రెజెన్సీ చాలా బాగుంది ? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ, దేవర భార్య పాత్రలో నటించిన నటి పేరు ‘శృతి మరాఠే’. ఆమె మరాఠీ నటి.

37 ఏళ్ల శృతి మరాఠే తన కెరీర్ మొదట్లో మోడల్‌గా చేశారు. ఆ తర్వాత 2008లో నటిగా తన జర్నీని ప్రారంభించింది. అన్నట్టు శృతి మరాఠే తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో అరవన్, నాంగ రొంబ మూవీలు చేశారు. అలాగే, మరాఠీలో రామ మాధవ్, తప్తాపడి, బంద్ నైలోంచే వంటి చిత్రాల్లో నటించారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. శృతి మరాఠే 2016లో మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్‌ను పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి దేవర సినిమాతో శృతి మరాఠేకి తెలుగులో కూడా మంచి ఫేమ్ వచ్చింది. ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.

Exit mobile version