సిరి లేళ్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

నారా రోహిత్‌ – నటి సిరీ లెల్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అలాగే, బాలయ్య బాబు కూడా హాజరు అయ్యారు. అయితే, ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించిన సిరి గురించి ఇప్పుడు నెటిజన్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిరి.. నటనపై మక్కువతో ‘ప్రతినిధి 2’తో తెరంగేట్రం చేశారు.

అన్నట్టు సిరి లెల్లా తెలుగమ్మాయే. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి ఆమె మాస్టర్స్ పూర్తి చేసింది. అయితే, సిరి లెల్లాకి సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల కోసమే ఆమె తిరిగి ఇండియాకు వచ్చేసింది. ఆ సమయంలోనే ఆమె ప్రతినిధి 2 సినిమా ఆడిషన్స్‌ జరుగుతుండగా వెళ్లింది. ఆ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే సిరి – రోహిత్ ప్రేమలో పడ్డారు.

Exit mobile version