సూపర్ స్టార్ నెక్స్ట్ ఛాయిస్ లారెన్స్ ..?

సూపర్ స్టార్ నెక్స్ట్ ఛాయిస్ లారెన్స్ ..?

Published on Mar 21, 2020 8:58 AM IST

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ డెబ్భై ఏళ్ళు పైబడినా వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతంతో పోల్చితే ఆయన సినిమాలు తీయడంలో స్పీడ్ పెంచారు. ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడు శివతో అన్నాత్తే అనే చిత్రంలో నటిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. కాగా రజిని నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తి వార్త ప్రచారం అవుతుంది.

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి డైరెక్టర్ మరియు హీరోగా ఎదిగిన రాఘవా లారెన్స్ సూపర్ స్టార్ రజినీతో మూవీ చేయనున్నారట. లారెన్స్ దర్శకత్వంలో రజిని తన 169వ చిత్రం చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది. లారెన్స్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో లక్ష్మీ బాంబ్ అనే హిందీ చిత్రం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు