ఇంట్రెస్టింగ్.. “ఇండియన్ 2” కి భారీ రన్ టైం, ఏ సర్టిఫికెట్?

ఇంట్రెస్టింగ్.. “ఇండియన్ 2” కి భారీ రన్ టైం, ఏ సర్టిఫికెట్?

Published on Jun 22, 2024 3:59 PM IST


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ మరియు సిద్ధార్థ్ ల కలయికలో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తెలుగులో “భారతీయుడు 2” పేరిట రాబోతుంది.

ఇక రీసెంట్ గానే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే ఈ సినిమా విషయంలో ఒక ఊహించని ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. జెనరల్ గా శంకర్ సినిమాలు అన్నీ కూడా దాదాపు మూడు గంటలు ఉంటాయని తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ఇండియన్ 2 కి కూడా వచ్చినట్టుగా వినిపిస్తుంది.

ఈ సినిమాకి ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అంతే కాకుండా ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ లో బుకింగ్స్ మొదలు కాగా అక్కడ నుంచి ఈ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. మరి ఇదే నిజం అయితే శంకర్ ఏదో స్పెషల్ గానే ప్లాన్ చేసారని అనుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు