బాలయ్య ప్రశ్నలు.. చంద్రబాబు సమాధానాలు.. అందరికీ అర్ధమయ్యేలా!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్‌స్టాపబుల్ 4వ సీజన్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వచ్చిన ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్‌లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించగా వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట.

బాలయ్య ముచ్చట్లు.. చంద్రబాబు చలాకీతనం, చురుకుదనం, సమయస్పూర్తితో సమాధానాలు చెప్పే తీరు చూస్తే ఆహాలో రిలీజ్ అయిన ప్రోమోలు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ‘మా బావ గారు.. మీ బాబు గారు’ అంటూ బాలయ్య అదరగొట్టేశారు. సీఎం చంద్రబాబు నాయుడిని బాలయ్య చాలా కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగినట్లుగా లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

జైలు జీవితం చంద్రబాబు నాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? భవిష్యత్తులో టీడీపీని సమర్థవంతగా నడపగల శక్తి లోకేష్‌కి ఉందంటారా? అని బాలయ్య ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఏం చెప్పారన్నది కూడా ఈ ఎపిసోడ్‌లో ఉంటుందట. ఇలా పలు ఆసక్తికర విషయాలను బాలయ్య అడగ్గా, చంద్రబాబు వాటికి ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు. ఇక ఇలాంటి చిక్కు ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Exit mobile version