టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమానే “క”. తన కెరీర్ లో కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన ఈ పీరియాడిక్ సినిమా ఓ రోజు ముందే ప్రీమియర్స్ వేసుకొని సాలిడ్ మౌత్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ దీపావళి రేస్ లో చాలా సినిమాలు ఉన్నాయి దీనితో మన తెలుగులో ఈ సినిమాకి తక్కువ స్క్రీన్స్ దొరికాయి.
అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా క సినిమా బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తక్కువ షోస్ లో ఉన్నప్పటికి ఎక్కువ బుకింగ్స్ ఈ సినిమాకి కనిపిస్తున్నాయి. దీనితో క సినిమా సత్తా చాటుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సుజీత్ సందీప్ లు దర్శకత్వం వహించగా దీనికి పార్ట్ 2 ని కూడా వారు కన్ఫర్మ్ చేశారు.