‘వార్ 3’ లీడ్ పై క్రేజీ అప్ డేట్ !

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని.. ముఖ్యంగా ‘వార్ 3’కి లీడ్ ఈ క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో వస్తోందని.. ఈ నెల నాలుగో వారం నుంచి ‘వార్ 2’ క్లైమాక్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. పైగా ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో హృతిక్ రోష‌న్‌ – ఎన్టీఆర్ లతో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటారని టాక్ నడుస్తోంది.

ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

అన్నట్టు ‘వార్ 2’ సినిమా కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version