బాలయ్య స్టైల్ ను మార్చాలనుకుంటున్నాడట !

Published on Jul 13, 2020 10:00 am IST


బాలయ్య తన సినిమాల స్టైల్ ను మార్చాలనుకుంటున్నాడు. తన సినిమా కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్య మార్పు చూపించలనుకుంటున్నాడు. అందుకే తన తరువాత సినిమాని అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయమని బోయపాటికి బాలయ్య సూచించాడట. మొత్తానికి బోయపాటి సైతం బాలయ్య అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ లో కొత్తదనం పెట్టాల్సి వచ్చిందట.

కాగా కొత్తదనం కోసమే బాలయ్య ఏకంగా గుండు కొట్టించుకున్నారట. అలాగే ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక పై తానూ చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య పట్టుబడుతున్నారట. అందుకే బి గోపాల్ సైతం బాలయ్య కోసం సాయి మాధవ్ చేత ఏభై ఏళ్ల వయసు ఉన్న ఓ పోలీస్ కథను రాయిస్తున్నాడు అట. మరి బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా అలాగే కొత్తగా చేసి.. ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More