‘దేవర’ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

‘దేవర’ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

Published on Jun 7, 2024 3:01 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉంటుందని.. సినిమా మొత్తానికే ఈ ట్విస్ట్ అదిరిపోతోందని.. అన్నిటికీ మించి దేవర పార్ట్ 2 కి ఈ క్లైమాక్స్ లోని బిగ్ ట్విస్టే మెయిన్ అని తెలుస్తోంది. అన్నట్టు దేవర కథకు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ అవుతుందట.

కాగా ఈ సినిమా తర్వాత షెడ్యూల్ లో సైఫ్ అలీఖాన్ – ఎన్టీఆర్ ల పై రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయింది. దేవర పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేసాడు.

మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ సాంగ్ కూడా అదరగొట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు