ఆస‌క్తిక‌రంగా ఆది సాయి కుమార్ ‘ష‌ణ్ముఖ’ పోస్ట‌ర్

ఆస‌క్తిక‌రంగా ఆది సాయి కుమార్ ‘ష‌ణ్ముఖ’ పోస్ట‌ర్

Published on Jul 8, 2024 10:29 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ష‌ణ్ముఖ’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుంది. ఈ సినిమాను ష‌ణ్ముగం సాప్ప‌ని డైరెక్ట్ చేస్తుండ‌గా, డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ద‌మ‌య్యింది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప‌వ‌ర్ఫుల్ పోస్ట‌ర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పోలీస్ డ్రెస్‌తో ఆది పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా, ఆయన వెనకాల షణ్ముఖ సుబ్రహ్మణ్య‌ స్వామి కనిపించడం అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లుగా తెలిపారు. ఇక ఈ సినిమాను విజువ‌ల్ వండ‌ర్ గా అద్భుత‌మైన గ్రాఫిక్స్ తో తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా ఆయ‌న తెలిపారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు