తేజ సజ్జ భారీ ప్రాజెక్ట్ “మిరాయ్” నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్

తేజ సజ్జ భారీ ప్రాజెక్ట్ “మిరాయ్” నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్

Published on Aug 23, 2024 10:45 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియెన్స్ లో గట్టిగా వైరల్ అవుతున్న పేరు “ఇంద్ర”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా మూమెంట్స్ మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి నిన్న మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయగా సినిమాతో పాటుగా ఆ సినిమాలో చిరంజీవికి చైల్డ్ వెర్షన్ గా కనిపించిన బాల్య నటుడు తేజ సజ్జ పేరు కూడా గట్టిగా వినిపించింది. మరి ఈ నెక్స్ట్ డే ఆగష్టు 23నే తేజ బర్త్ డే కావడం విశేషం.

ఇక ఈరోజు తన నెక్స్ట్ భారీ చిత్రం “మిరాయ్” నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ని అయితే అందిస్తున్నట్టుగా టైం ని లాక్ చేశారు. ఆల్రెడీ టీజర్ తో హాలీవుడ్ ధీటు విజువల్స్ ని చూపించిన యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని అయితే తేజ సజ్జ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. మరి ఇందులో తేజ సజ్జ పై ఏదో గ్రాండ్ సీక్వెన్స్ ని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తుంది.

తమ ప్రపంచంలో ఏదో డిజాస్టర్ జరిగిన సమయంలో ఒక రాడ్ ని పట్టుకుని కనిపిస్తున్నాడు. దీనితో ఈ పోస్టర్ మాత్రం మరింత ఆసక్తిని పెంచింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి కూడా హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కి తీసుకురాబోతున్నారు. అలాగే ఈ సినిమా 2డి సహా 3డి లో వరల్డ్ వైడ్ మొత్తం 7 భాషల్లో విడుదలకి తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు