ఈ లేటెస్ట్ ప్రాజెక్ట్ లో ఊహించని రోల్ లో బాలయ్య..?

Published on Aug 12, 2022 1:39 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో తన కెరీర్ లో 107వ సినిమాని మాసివ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడితో కూడా ఓ సినిమాకి బాలయ్య కమిట్ అయ్యిన సంగతి కూడా తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక క్రేజీ అనౌన్సమెంట్ ని కూడా ఇవ్వడంతో దీనిపై అనేక అంచనాలు మొదలయ్యాయి.

అయితే ఈ అనౌన్సమెంట్ వీడియో చూస్తుంటే బాలయ్య ని డెఫినెట్ గా ఒక ఊహించని పాత్రలో చూడబోతున్నామా అనిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్య ట్రెండీ లుక్స్ తో ఒక సరైన మాస్ అండ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా పడితే ఎలా ఉంటుందో అన్నట్టుగా ఇందులో అనిపిస్తుంది. మరి అనీల్ అయితే బాలయ్యకి ఎలాంటి రోల్ డిజైన్ చేసాడో అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగక తప్పదు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుంగా షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :