అల్లు అర్జున్ పేరుపై ఇంట్రెస్టింగ్ రూమర్!

అల్లు అర్జున్ పేరుపై ఇంట్రెస్టింగ్ రూమర్!

Published on Apr 1, 2025 5:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు ఓ క్రేజీ పాన్ ఇండియా లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో మొదటగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ మొదట ఉంటుంది అనేది ప్రస్తుతానికి గట్టిగా వినిపిస్తున్న టాక్. అయితే ఇపుడు బన్నీపై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ కూడా వినిపిస్తుంది.

మన తెలుగు సినిమా సహా ఇతర ఇండస్ట్రీ లకి చెందిన చాలా మంది హీరోలు హీరోయిన్స్ కూడా సంఖ్యా శాస్త్రం రీత్యా తమ పేర్లని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఉన్న పేరులో ఒకటీ లేదా రెండు అక్షరాలు మార్చుకున్న వారు చాలా మంది కనిపిస్తారు. అయితే ఇపుడు ఇదే టాక్ బన్నీపై కూడా వినిపిస్తుంది. దీని ప్రకారం అల్లు అర్జున్ పేరులో కూడా మార్పు ఉంటుంది అని ఓ క్రేజీ రూమర్ ఇపుడు మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు