మహేష్ సినిమా పై ఇంట్రస్టింగ్ రూమర్ !

Published on Nov 22, 2020 2:09 am IST

రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుండి ఇద్దరు హీరోల టీజర్ లకు సంబంధించిన వీడియోలు కూడా జనాన్ని ఒక ఊపు ఉపేశాయి. అందుకే రాజమౌళి తరువాత సినిమా పై కూడా అప్పుడే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. ఇప్పటికే రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని, ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మరో సిల్లీ రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More