పవర్ స్టార్ మూవీ నుండి తప్పుకున్న హీరో?

Published on Jul 4, 2020 9:16 pm IST

తన సినిమాలకు ప్రత్యేకమైన ప్లాట్ ఫార్మ్ పెట్టుకొని సినిమాలు విడుదల చేసుకుంటూ డబ్బులు గడిస్తున్నాడు చంద్రబాబు. ఆయన ఇటీవల తెరకెక్కించిన క్లైమాక్స్, నగ్నం బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ స్పూర్తితో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలకు సబ్జక్ట్స్ గా కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ ఎంచుకుంటున్నాడు. దాదాపు మూడు నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధం చేసిన వర్మ, కొద్దిరోజుల క్రితం పవర్ స్టార్ పేరుతో ఓ మూవీ ప్రకటించారు.

ప్రకటనతో పాటు పవన్ కళ్యాణ్ ని పోలిన ఓ మనిషితో ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. కాగా పవన్ కళ్యాణ్ పోలికలు కలిగిన ఆ నటుడు ఆర్ జి వి ‘పవర్ స్టార్’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం అందుతుంది. కారణం ఏదైనా ఆ నటుడు పవర్ స్టార్ మూవీలో చేయడం లేదని సమాచారం. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

సంబంధిత సమాచారం :

More