ఇంట్రెస్టింగ్.. “గేమ్ ఛేంజర్” లో కీలక సన్నివేశం ఇప్పుడా!?

ఇంట్రెస్టింగ్.. “గేమ్ ఛేంజర్” లో కీలక సన్నివేశం ఇప్పుడా!?

Published on Jun 18, 2024 8:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా అంజలి అలాగే కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ లో ఎట్టకేలకి రామ్ చరణ్ తన పోర్షన్ ని పూర్తి చేసుకునే దగ్గరకి వచ్చేసాడు.

ఇంకా ఒకటి లేదా రెండు రోజుల షూట్ గ్యాప్ లోనే ఉన్న ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. రామ్ చరణ్ పై ఇంట్రో సీన్స్ ని శంకర్ ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట. ఇప్పటి వరకు ఎన్నో సీక్వెన్స్ లు పూర్తి చేసిన శంకర్ చిట్ట చివరిగా చరణ్ ఎంట్రీ సీన్ తో ముగిస్తున్నారట.

దీనితో అయితే సినిమాలో చరణ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది అని చెప్పాలి. టైటిల్ కార్డ్ వరకు శంకర్ మార్క్ లో పవర్ఫుల్ లెవెల్లో వేసి తన హీరోలపై సింపుల్ అండ్ సెన్సేషనల్ గా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు