ఇంట్రెస్టింగ్.. నానిపై కూడా ఇంత ద్వేషమా?

ఇంట్రెస్టింగ్.. నానిపై కూడా ఇంత ద్వేషమా?

Published on Jan 29, 2025 8:59 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో తన సహజమైన నటనతో నాచురల్ స్టార్ అనిపించుకున్న నాని కూడా ఒకరు. మరి హీరోగా తాను చేసిన ఇన్ని సినిమాల్లో మంచి వైవిధ్యత కనబరుస్తూ ఇపుడు సాలిడ్ ప్రాజెక్ట్ “హిట్ 3” తో రాబోతున్నాడు. అయితే ఇన్నేళ్ళలో చాలా మంది హీరోస్ కి ఉన్నట్టుగానే నానిపై కూడా పలు ట్రోల్స్ లాంటివి చాలా తక్కువ అని చెప్పొచ్చు.

కానీ ఇంట్రెస్టింగ్ గా ఇపుడు సోషల్ మీడియాలో నాని విషయంలో తన అభిమానులు మినీ యుద్ధమే చేస్తున్నారు. మెయిన్ గా మొన్న వచ్చిన హిట్ 3 పోస్టర్ తో వచ్చిన నెగిటివిటీ అంతా ఇంతా కాదు. నాని ఆఫ్ లైన్ లో కూడా ఎక్కడా ఎప్పుడూ మాట తూలడం లేదా సినిమాల్లో అయినా కూడా అతిగా చేసిన దాఖలాలు ఉండవు. అయినప్పటికీ తన విషయంలో ఇపుడు ఈ రేంజ్ లో నెగిటివ్ కనిపించడం అనేది ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు