కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన సూర్య శివకుమార్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ కంగువ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పై కోలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈమూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఎంతో భారీ వ్యయంతో కంగువ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అయితే మ్యాటర్ ఏమిటంటే సూర్య బాలీవుడ్ డెబ్యూ మూవీ పై కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి.
ఇక తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆయన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి సినిమాలను తెరకెక్కించిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తో సూర్య తన డెబ్యూ మూవీ చేయడనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన పిక్ వైరల్ అవడంతో వీరి కలయిక మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ పీరియాడిక్ జానర్ లో తెరకెక్కనుండగా దీనికి కర్ణ అనే టైటిల్ అనుకుంటుండగా దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శకుడు రాకేష్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.