నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “డాకు మహారాజ్” తో తన కెరీర్లో మరో సాలిడ్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత బాలయ్య నుంచి మరింత స్ట్రాంగ్ లైనప్ కనిపిస్తుండగా వీటితో తన అవైటెడ్ క్రేజీ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం” కూడా ఒకటి.
దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. దీనితో మొదటి భాగంలో బాలయ్య కనిపించిన దానికంటే తలదన్నేలా బోయపాటి శ్రీను మరింత పవర్ఫుల్ షేడ్ ని బాలయ్య కోసం సిద్ధం చేశారట.
డెఫినెట్ గా ఈ కొత్త లుక్ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అని తెలుస్తుంది. మరి ఈ లుక్ రిలీజ్ పై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో నిర్మాతలు రిలీజ్ కి తీసుకొస్తున్నారు.