“గేమ్ ఛేంజర్” నెక్స్ట్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ టాక్.!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సమయం దగ్గరకి రానే వస్తుంది. అయితే ఆల్రెడీ రెండు సాంగ్స్ ని వదిలిన మేకర్స్ ఇప్పుడు మూడో సాంగ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ సాంగ్ పై థమన్ కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించాడు.

అయితే ఈ సాంగ్ పై ఇప్పుడు మరో సాలిడ్ బజ్ వినిపిస్తుంది. ఈ మెలోడీ రామ్ చరణ్ కియారా నడుమ ఉండేది కాదట. రామ్ చరణ్ అంజలి నడుమ సాంగ్ ని వదలనున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనిది అని ఓ టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇలాంటి సాంగ్స్ ని డైరెక్ట్ గా థియేటర్స్ లోనే చూపిస్తే బెటర్ గా ఉండేది అని చెప్పొచ్చు. ఇంతకీ వచ్చేది ఏ సాంగ్ అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version