ఇంట్రెస్టింగ్..ఒకే రన్ టైంతో వస్తున్న ఈ ఫ్రైడే చిత్రాలు.!

ఇంట్రెస్టింగ్..ఒకే రన్ టైంతో వస్తున్న ఈ ఫ్రైడే చిత్రాలు.!

Published on Sep 24, 2024 5:00 PM IST

మళ్ళీ చాలా కాలం తర్వాత థియేటర్స్ లో భారీ బుకింగ్స్ ఈ ఫ్రైడే రిలీజ్ కి చూస్తున్నాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన భారీ చిత్రం “దేవర” గ్రాండ్ గా ఈ వారంలో థియేటర్స్ లోకి రిలీజ్ కి రాబోతుంది. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం వస్తుండగా ఈ సినిమాతో పాటుగా టాలెంటెడ్ నటుడు కార్తీ (Karthi) నటించిన చిత్రం “సత్యం సుందరం” కూడా థియేటర్స్ లో ఈ వారంలోనే రిలీజ్ కి రాబోతుంది.

అయితే తమిళ్ లో మాత్రం దేవర తోనే రిలీజ్ కి వస్తున్నా ఈ చిత్రం తెలుగులో ఒకరోజు తర్వాత రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ ఫ్రైడే రిలీజ్ కి వస్తున్న ఈ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఒకే రన్ టైం వస్తుండడం యాదృచ్చికంగా కనిపిస్తుంది. అది కూడా భారీ రన్ టైం లోనే ఈ చిత్రాలు వస్తున్నాయి.

యాక్షన్ డ్రామా దేవర 2 గంటల 57 నిమిషాల నిమిషాల నిడివితో వస్తుండగా కార్తీ క్లీన్ ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం కూడా ఇదే 2 గంటల 57 నిమిషాల నిడివితో రాబోతుంది. ఇలా రెండు సినిమాలు కూడా ఒకే రన్ టైం తో ఫ్రైడే రిలీజ్ కి రావడం ఒకింత ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు