క్రేజీ మల్టీ స్టారర్ సినిమాకు ‘ఎనిమీ’ టైటిల్

Published on Nov 25, 2020 1:06 am IST

తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్యలు ఒక మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి బాల దర్శకత్వంలో చేసిన ‘అవన్ ఇవన్’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ మంచి నటులే కావడంతో సినీ ప్రేక్షకులు మంచి ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో షూటింగ్ మొదలైంది. ఇకపోతే సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.

సినిమాకు ‘ఎనిమీ’ అనే టైటిల్ నిర్ణయించినట్టు తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంటే సినిమాలో విశాల్, ఆర్యలు ఒకరికొకరు శత్రువులా లేకపోతే వీరిద్దరికీ కలిపి వేరొక శత్రువు ఉండబోతున్నాడా. ఉంటే అతను ఎవరు. ఈ వివరాలన్నీ ఇంకొన్ని గంటల్లో రివీల్ కానున్నాయి. చిత్ర టీమ్ 25న టైటిల్ రివీల్ చేయబోతున్నారు. నిర్మాత వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో మృణాళిని రవి కథానాయకిగా నటిస్తోంది. స్టార్ కంపోజర్ తమన్ ఈ సినిమాకు సంగీతం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :