అక్కినేని వారి యంగ్ అండ్ డాషింగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన రీసెంట్ భారీ బడ్జెట్ చిత్రం “ఏజెంట్”. టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం అనుకోని విధంగా పరాజయం పాలయ్యింది. కానీ ఈ సినిమాకి అప్పుడు థియేట్రికల్ గా ఎంత డిమాండ్ అయితే నెలకొందో గత కొన్నాళ్ల నుంచి ఓటిటి రిలీజ్ విషయంలో కూడా అంతే డిమాండ్ మరియు సస్పెన్స్ నెలకొంది.
మరి ఈ సినిమా ఇప్పుడిప్పుడే స్మాల్ స్క్రీన్ మీదకి రాబోతుంది. ఆల్రెడీ హిందీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకోగా ఇక అంతా నెక్స్ట్ తెలుగు ఓటిటి ఎంట్రీ కోసం చూస్తున్నారు. అయితే రీసెంట్ గానే ఈ జూలైలో రిలీజ్ ఉండొచ్చు అని బజ్ వచ్చింది కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ఎందులో రిలీజ్ అవుతుంది అనేది సస్పెన్స్ గా మారింది.
గతంలో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సోనీ లివ్ వారు సొంతం చేసుకున్నారు అలాగే డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ సినిమా రిలీజ్ కాలేదు. ఇపుడు ఏకంగా ఏజెంట్ సంబంధిత పోస్ట్ లు అన్నీ తొలగించారు. సో వీరి నుంచి ఈ సినిమా రాదని కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి ఏఈ జూలై లో వస్తే ఎందులో వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ గా మారింది. మరి చూడాలి ఏజెంట్ రాక ఎప్పుడు ఎందులో ఉంటుంది అనేది.