మాస్ మహారాజ్ “మిస్టర్ బచ్చన్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్

మాస్ మహారాజ్ “మిస్టర్ బచ్చన్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్

Published on Jun 15, 2024 11:04 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ “మిస్టర్ బచ్చన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూటింగ్ వేగంగా పూర్తి అవుతుండగా మేకర్స్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ అందించారు. మాస్ మహారాజ ఫ్యాన్ ఒకరు మిస్టర్ బచ్చన్ సెట్స్ లోకి ఎంటర్ అయ్యి హరీష్ శంకర్ తో మాట్లాడినట్టుగా ఓ వీడియో కట్ చేసి రిలీజ్ చేశారు.

ఇక దీనితోనే ఈ జూన్ 17న మిస్టర్ బచ్చన్ షో రీల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ షో రీల్ ఎలా ఉంటుందో ఆరోజు వరకు ఆగి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని హిందీ సినిమా “రైడ్” కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు