“భగవంత్ కేసరి” సెన్సార్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన భారీ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే దసరా కానుకగా రాబోతుండగా ఈ చిత్రం సెన్సార్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సెన్సార్ విషయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

దీనితో అయితే అసలు భగవంత్ కేసరి కి సెన్సార్ లో ఒక్క కట్ కూడా చెప్పలేదు అట. దీనితో సినిమాని మేకర్స్ ఎలా అయితే సెన్సార్ కి పంపించారో అదే విధంగా అంతే క్లీన్ గా సెన్సార్ జీరో కట్స్ తో చేసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు అయితే నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version