వరల్డ్ వైడ్ “క్యాప్టెన్ మిల్లర్” టీజర్ కి ఇంట్రెస్టింగ్ ప్లాన్.!


కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “క్యాప్టెన్ మిల్లర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ కట్ కి పాన్ ఇండియా వైడ్ గా అయితే భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఈ చిత్రం విషయంలో మేకర్స్ ఇంట్రెస్టింగ్ ప్లాన్ ని ఇప్పుడు చేస్తున్నారు. ఈ సినిమాని వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో మరింత రీచ్ అయ్యేందుకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన దేశాల తాలూకా భాషల్లో అయితే డబ్ చేసి ఈ అక్టోబర్ 19 నుంచి టీజర్ ని ఆ దేశాల్లో ప్రదర్శించనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రం పాన్ ఇండియా భాషలు సహా పాన్ వరల్డ్ భాషల్లో కూడా విడుదల కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా శివ రాజ్ కుమార్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భాగాలుగా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే సత్యజ్యోతి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version