క‌ల్కి: ‘ఫ‌స్ట్’ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

క‌ల్కి: ‘ఫ‌స్ట్’ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Jun 14, 2024 11:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ సెన్సేష‌న్ ‘క‌ల్కి 2898 AD’ కోసం ప్రేక్ష‌కులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కించ‌గా, ఇది ఆడియెన్స్ ను స్ట‌న్ చేసేందుకు సిద్ధ‌మైంది. కాగా, ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ పై మేక‌ర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని “మ్యూజికల్ జ‌ర్నీలో భాగంగా ఫ‌స్ట్ డెస్టినేష‌న్ రీచ్ అయ్యే టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది” అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాలోని ఫ‌స్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టానీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్విని ద‌త్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 27న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ చేయ‌నున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు