టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ఆగష్టు 29న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక దీని అనంతరం సుజీత్ తో ఇప్పటికే ఒక మూవీ కమిట్ అయ్యారు నాని. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు మూవీస్ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండడం.
వయొలెంట్ మ్యాన్, నాన్ వయొలెంట్ గా మారితే అనే కాన్సెప్ట్ తో మాస్ యాక్షన్ డ్రామాగా సుజీత్ ఈమూవీని తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దీని యొక్క షూటింగ్ త్వరలో ప్రారంభించి రానున్న డిసెంబర్ లో పక్కాగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నాని కెరీర్ 32వ మూవీగా రూపొందుతున్న దీని అనౌన్స్ మెంట్ వీడియో ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. త్వరలో ఈమూవీ గురించి అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి.