దేవర క్లైమాక్స్ కోసం భారీ సెట్ ?

దేవర క్లైమాక్స్ కోసం భారీ సెట్ ?

Published on Jan 22, 2024 10:01 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. కాగా తాజాగా ఈ చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూట్ కి సన్నాహాలు చేసుకుంటోంది. కోటి రూపాయల భారీ స్విమ్మింగ్ ఫూల్ సెట్‌లో దేవర క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఎన్టీఆర్ అభిమానులకు ఈ యాక్షన్ సీక్వెన్స్ కనుల విందుగా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరుగుతుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు