‘రొమాంటిక్’ క్లైమాక్స్ లో ఫుల్ రొమాన్స్ అట !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత నెలలో హైదరాబాద్ లో సాంగ్స్ తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాల షూటింగ్ ను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో లిప్ టు లిప్ కిస్ సీన్ ఉందట. సినిమా చివరి షాట్ కిస్ తోనే ఎండ్ అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి ‘రొమాంటిక్’ను రొమాన్స్ తో ముగించబోతున్నారు అన్నమాట. అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా రమ్యకృష్ణ సన్నివేశాలు చాల బాగా వచ్చాయట. మందిరా బేడి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. మరి ఈ చిత్రంతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా… హిట్ వస్తేనే ఆకాష్ కెరీర్ ఊపందుకుటుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌ – ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version