విజయ్ ఫైనల్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

విజయ్ ఫైనల్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Aug 16, 2024 7:05 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో “ది గోట్” అనే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది విజయ్ కెరీర్ లో 68వ సినిమా కాగా ఈ చిత్రం తర్వాత విజయ్ ఒక్క సినిమా చేసి సినిమాలకి స్వస్తి చెప్పనున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. అయితే ఈ సినిమా ఎవరితో చేస్తాడు అనేది ఎప్పుడు నుంచో మంచి సస్పెన్స్ గా మారగా ఇప్పుడు దీనిపై స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

దీని ప్రకారం విజయ్ ఫైనల్ సినిమాని ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహించడం కన్ఫర్మ్ అయ్యిందట. అంతే కాకుండా ఇది వరకు వినిపించిన బజ్ ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అనేది అవాస్తవం అని ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సినిమా ఒక పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించనున్నట్టుగా టాక్. మరి ఈ చిత్రంపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు