‘ప్రేమ కథా చిత్రమ్’ తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న నటి నందిత. తరువాత నందిత కొన్ని సినిమాలు చేసినా అవి తన నటిగా తన పురోగతికి తోడ్పడలేకపోయాయి. నారా రోహిత్ తో జంటగా తను టైటిల్ రోల్ లో నటిస్తున్న ‘సావిత్రి’ సినిమా విడుదల సందర్భంగా చెప్పిన విశేషాలు..
ప్రశ్న) మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది ?
స) దర్శకుడు పవన్ సాధినేని మొదట ‘సావిత్రి’ అని టైటిల్ చెప్పినప్పుడు ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ కథ అనుకున్నా. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న నేను నటిగా నేను ఇటువంటి సినిమా చేస్తే బాగుండదనుకుని సందేహించాను కానీ కథ మొత్తం విన్న తరువాత ఇది మంచి కుటుంబ కథా చిత్రం అవుతుందని అనిపించడంతో చేయడానికి అంగీకరించాను.
ప్రశ్న) మీ పాత్ర గురించి చెప్పండి ?
స) జీవితంలో పెళ్లి త్వరగా చేసుకోవాలనే కోరిక ఉన్నసాధారణ అమ్మాయి పాత్ర. ఇది కథలో కీలకమలుపు కి కారణం అవుతుంది. నారా రోహిత్ ఎలా వస్తాడు తను వచ్చిన తరువాత కథ ఎలా మారుతుంది అన్నది స్థూలంగా సినిమా కథ.
ప్రశ్న) తెలుగు బాగా మాట్లాడుతున్నారు… మీరే డబ్బింగ్ చెప్పుకోవచ్చుగా ?
స) అవును. నాకు డబ్బింగ్ చెప్పాలన్న కోరిక ఉంది. కానీ ఎందుకో దర్శకులు వేరొకరి చేత నాకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు. కానీ భవిష్యత్తులో డబ్బింగ్ చెప్పుతానన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) పవన్ సాధినేని తో పని చేయడం ఎలా ఉంది ?
స) ఈ పాత్ర చేస్తున్నప్పుడు నాలో ఉన్న భయాన్ని పవన్ సాధినేని పోగొట్టి నాతో బాగా నటింప చేశాడు.
ప్రశ్న) నారా రోహిత్ తో కలిసి పని చేయడం ఎలా ఉంది?
స) తన పని తను చేసుకుపోవడం తప్ప ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడు. మంచి మనిషి ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు.
ప్రశ్న) మీ కెరీర్ పట్ల మీరు ఆనందంగా ఉన్నారా?
స ) దీనికి సమాధానం అవును, కాదు అని చెప్పాలి. ఎందుకంటే నేను తక్కువ సినిమాలు చేస్తున్నా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ లో సినిమాలు చేయాలని ఉంది. కానీ ఇప్పటివరకు నేను సాధించిన దానితో నేను సంతృప్తి గా ఉన్నాను.
ప్రశ్న) సావిత్రి గురించి ఒక మాటలో చెప్పండి .. ?
స) ఎటువంటి అసభ్యత లేని ఓ మంచి కుటుంబ కథా చిత్రం అని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ సినిమాలో కథలో భాగంగా ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంది. ఈ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుంది.
ప్రశ్న) మీరు చేయబోయే సినిమాల గురించి చెప్పండి ?
స) ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.