ఇంటర్వ్యూ : నిర్మాత కె.కె.రాధామోహన్ – ‘క్రేజీ ఫెలో’ యూత్, ఫ్యామిలీ లను ఆకట్టుకునే సినిమా

 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాత కె.కె.రాధామోహన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

 

మీ సినిమా దసరా, దీపావళికి మధ్యలో విడుదలౌతుంది కదా.. ఇది ఎలాంటి సమయం అనుకుంటున్నారు ?

కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ చాలా సినిమాలు వరుసలో వున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. నవంబర్ డిసెంబర్ లో కూడా వరుసగా సినిమాలు వున్నాయి. అయితే ప్రస్తుతం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం పెద్ద సవాల్. క్రేజీ ఫెలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దినితో పాటు వైవిధ్యమైన ప్రమోషన్స్ చేస్తున్నాం. రెండు వెహికల్స్ తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. ప్రతి చోట ట్రైలర్, సాంగ్స్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశాం. దీనితో పాటు టీవీ కమర్షియల్, పోస్టర్స్, గూగుల్ యాడ్స్ ,అన్ని రకాలుగా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం వున్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం వుంది.

 

కథలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి ?

క్రేజీ ఫెలో కథ చాలా బావుటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా వుంటుంది. ఆది క్యారెక్టర్ చాలా క్రేజీగా కొత్తగా వుంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ వుంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో.

 

మీ నిర్మాణంలో మీకు తృప్తిని ఇచ్చిన చిత్రాలు ?

కథ పరంగా అధినేత నాకు చాలా తృప్తిని ఇచ్చిన చిత్రం. ఏమైయింది ఈవేళ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మారుతి లాంటి దర్శకులు ఆ సినిమాతోనే స్ఫూర్తి పొంది సినిమాలు చేశామని చెబుతుంటారు. పంతం సినిమాలో ఇచ్చిన సందేశం కూడా నచ్చుతుంది. కమర్షియల్ గా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం రవితేజ బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ నిర్మాత అనే గుర్తింపు తెచ్చింది.

 

ఈ చిత్రంలో హీరోయిన్స్ కోసం చెప్పండి?

దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ ఇద్దరూ చాలా చక్కగా చేశారు. మిర్నా మీనన్ కి ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్రలో మంచి సర్ ప్రైజ్ వుంటుంది.

 

సంగీత దర్శకుడు కోసం చెప్పండి?

ఆర్ఆర్ ద్రువన్ అప్ కమిగింగ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఐదు పాటలు డిఫరెంట్ వేరియేషన్స్ లో చేశాడు. ఆర్ఆర్ ని కూడా చాలా బ్రిలియంట్ గా చేశాడు. మ్యూజిక్ విషయంలో తృప్తిగా వుంది.

 

ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం.

Exit mobile version