ఇంటర్వ్యూ : రామ్ కార్తీక్ – “ఎఫ్‌సీయూకే”లో ఆ సీన్ చెయ్యడం ఛాలెంజింగ్ అనిపించింది

ఇంటర్వ్యూ : రామ్ కార్తీక్ – “ఎఫ్‌సీయూకే”లో ఆ సీన్ చెయ్యడం ఛాలెంజింగ్ అనిపించింది

Published on Feb 10, 2021 5:15 PM IST

సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఎఫ్ సి యూ కె”. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న యువ హీరో రామ్ కార్తీక్ తో ఈ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం మరి ఇందులో అతను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

ఈ స్క్రిప్ట్ చెప్పినపుడు ఎలా ఫీల్ అయ్యారు మీకు బాగా నచ్చింది ఏంటి?

ఈ సినిమా కథ నేను వినక ముందు సాగర్ గారు ఓసారి కాల్ చేశారు డేట్స్ ఉన్నాయా లేదా ఏంటి అని అప్పుడు ఈ కథ కోసం కలిసాం అప్పటికి కూడా నాకు సరైన ఇన్ఫో లేదు ఆ తర్వాత నన్నేదో ర్యాండమ్ గా సెలెక్ట్ చేశారు అనుకున్నాను కానీ ట్రావెలింగ్ లో తెలిసింది. కావాలనే నన్ను తీసుకున్నారని అప్పటి నుంచి ఇంకా బాధ్యతతో ఈ సినిమా చేశాను.

జగపతిబాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకోడం ఎలా అనిపించింది?

చాలా అదృష్టం అనుకుంటున్నా అలాంటి లెజెండరీ యాక్టర్ తో స్క్రీన్ పంచుకోవడం అనేది. మొదట్లో అయితే భయపడ్డాను ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. పైగా మా ఇద్దరికీ మొదటి సీనే చిన్న గొడవ పడేలాంటిది ఒక్కసారి అది అయ్యాక ఆయనతో ఇక ఫ్రీ అయ్యాను.

ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయని విన్నాం సినిమాలో?

అవును అక్కడక్కడా మంచి ఎమోషన్స్ ఉంటాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు నాకు జగపతి బాబు గారి మధ్య మంచి సెంటిమెంట్ సీన్స్ కూడా ఉన్నాయి. అంటే మన ఇంట్లోనే తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ స్ట్రగుల్స్ ఉంటాయి.

రంజిత్ మూవీస్ అంటే ఒక పర్పస్ ఉన్న సినిమాలే ఉంటాయి ఇదెలా ఉంటుంది?

అది నిజం అండి ఆ సంస్థలో ఒక సినిమా ఓకే అవ్వడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే దాము గారు స్క్రిప్ట్స్ విషయంలో కానీ క్యాస్టింగ్ విషయంలో కానీ అంత పర్టిక్యులర్ గా ఉంటారు అలాగే టైటిల్ విషయంలో కూడా. అందుకే 50 పర్సెంట్ ఆ బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే మినిమమ్ ఉంటుంది. అదే మెయిన్ కారణం.

ఈ సినిమాలో ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటి?

నాకు జగపతిబాబు గారికి ఓ సీన్ లో చీర్స్ చెప్పేటప్పుడు నా చేతిలో గ్లాస్ తో ఆయన మొహం పై కొట్టాలండి అది నాకు చాల ఛాలెంజింగ్ గా అనిపించింది. అలాంటి వ్యక్తితో ఆ సీన్ చెయ్యడం అనేది కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ ఆయన ఏం పర్వాలేదు ఇది సినిమా ఈ సీన్ ఇలాగే ఉండాలి అని ధైర్యం చెప్పారు.

హీరోయిన్ అభిరామి కోసం ఏమన్నా చెప్పండి.

తను తమిళ్ అమ్మాయి అయినా సరే తెలుగులో ఎలాంటి ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేసేది ఒక రెండు పేజీల డైలాగ్స్ అయినా కూడా ఆమె మెమొరీ పవరో ఏమో కానీ భట్టీ పట్టేసి మరీ చెప్పేసేది. చాలా టాలెంటెడ్ తను.

ఇంతకు ముందు చాలా సినిమాలు చేశారు కానీ సరైన గుర్తింపు రాలేదు ఈ సినిమా ఎంత వరకు హెల్ప్ అవుతుంది మరి?

అవునండి నా సినిమా వస్తుంది అంటే ఒక రకమైన టెన్షన్ ఉండేది ఒక డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళిపోతా కానీ ఈ సినిమా విడుదల అవుతున్నా ఎలాంటి టెన్షన్ లేదు ఎందుకంటే దాము గారు ఉన్నారన్న కొండంత బలం అలాగే ఈ సినిమా అందరికీ రీచ్ అవుతుంది అనే నమ్మకం ఉంది.

టైటిల్ విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి దానికి మీరేం అంటారు?

ఈ సినిమాకు ముందు రెండు మూడు టైటిల్స్ అనుకున్నాం కాకపోతే అవన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయ్యిపోవడం కాస్త రిలేటెడ్ గా అనిపించపోవడం స్క్రిప్ట్ ఏమో నలుగురు చుట్టూ తిరిగే స్టోరీ సో ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ ను షార్ట్ కట్ లో “ఎఫ్ సి యూ కె” అని పెట్టేసాం.

కాంపిటేషన్ ఉంది కదా ప్రెజర్ ఎమన్నా ఫీలవుతున్నారా?

కాంపిటేషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది కానీ నాకు మా సినిమాపై మంచి నమ్మకం ఉంది. కాంపిటేషన్ ఎప్పుడు అవుతుంది అంటే రెండు ఒకే జానర్ లో ఉన్నప్పుడు ఒకేలాంటి సినిమాలు అయితే అప్పుడు ఉంటుంది వేరే వేరే కథలు అయ్యినప్పుడు పెద్దగా ఏమీ అనిపించదు.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి కొత్త స్క్రిప్ట్స్ ఏమన్నా విన్నారా?

ముందు అయితే సినిమా రిలీజ్ కోసమే చూస్తున్నాను, కొత్త స్క్రిప్ట్స్ కూడా కొన్ని విన్నాను కానీ ముందు ఈ సినిమా రిలీజ్ అవ్వాలని చూస్తున్నా.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు