ఇంటర్వ్యూ : మహేష్ బాబు – “సర్కారు వారి పాట” పూర్తి క్రెడిట్ అతడికే..

Published on May 10, 2022 6:00 pm IST

ఎన్నో అంచనాలు నడుమ టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి రెడీ అవుతున్న మరో మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ కీర్తి సురేష్ అలాగే దర్శకుడు పరశురామ్ పెట్ల తో తెరకెక్కించిన ఈ ఫస్ట్ టైం కాంబినేషన్ భారీ అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ మీడియాతో ముచ్చటించడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.

 

“సర్కారు వారి పాట” పై డైరెక్టర్ పరశురామ్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు..

ఈ సినిమా విషయంలో టోటల్ క్రెడిట్ పరశురామ్ కే వెళ్తుంది. తను నా రోల్ ని చాలా కొత్తగా డిజైన్ చేసాడు. అది అందరికీ నచ్చుతుంది. ఇంకా నాకు అయితే మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయి పోకిరి టైం లో లాంటి డైలాగ్స్ చెప్పడంతో నేను కూడా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.

 

పోకిరి సినిమాకి దీనికి ఏమన్నా పోలిక ఉంటుందా?

ఆ సినిమా కథకి దీనికి ఏం సంబంధం ఉండదు కానీ ఆ సినిమాలో నేను చేసిన రోల్ ఎలా అయితే అంత సాలిడ్ గా ఉంటుందో మళ్ళీ నేను సర్కారు వారి పాట కి అంతే మాస్ గా ఫీల్ అయ్యాను. కేవలం ఆ క్యారక్టరైజేషన్ లా మాత్రమే అనిపిస్తుంది అని ఫీల్ అయ్యాను అంతే అంతకు మించి ఏం లేదు.

 

ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్ తో సినిమాలు చేసారు.. పరశురామ్ లో మీరు గమనించింది ఏంటి?

పరశురామ్ లో ఒక ట్రెమండస్ రైటింగ్ స్కిల్ ఉంది. అది అతనిలో నాకు ఒక స్పార్క్ లా కనిపించింది. ఒక రచయిత దర్శకుడు అయితే సినిమా చాలా బాగా వస్తుంది. అలాగే నేను చేసిన దర్శకుల్లో చాలా మంది ఉన్నారు.

 

మ మ మహేషా సాంగ్ ఎలా వచ్చిందో చెప్పండి?

ముందు అయితే సినిమా అంతా చూసి అప్పటికే వేరే సాంగ్ అయ్యింది. మొత్తం చూసాక మా డైరెక్టర్ ఒక మాస్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది అన్నారు అప్పుడు థమన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసాడు. అప్పటికే డబ్బింగ్ అన్నీ లాస్ట్ సాంగ్ లోకి వచ్చేసాయి. అప్పుడు వచ్చింది ఈ సాంగ్ నా కెరీర్ లోనే ఇలాంటి మాస్ సాంగ్ అయితే నేను చెయ్యలేదు. ఇది ఖచ్చితంగా సినిమాలో ఒక హైలైట్ అవుతుంది.

 

ఈ సినిమాలో కూడా సమాజానికి సంబంధించి ఏమన్నా మెసేజ్ ఉంటుందా?

ఇంకో రెండు రోజుల్లో సినిమా వస్తుంది కదా చూస్తే అందరికీ తెలుస్తుంది. ఇది వరకు గత సినిమాల్లో చేశాను అంతా బాగుంది అన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కొత్తగా ట్రై చేసాం దీనిని కూడా ఎంజాయ్ చెయ్యనివ్వాలి..

 

బాలీవుడ్ సినిమాపై ఏదో కామెంట్ చేసినట్టు ఉన్నారు..

లేదండి నేనెప్పుడూ అలా కామెంట్ చెయ్యలేదు.. నేనెప్పుడూ తెలుగు సినిమాలే చేస్తాను అన్నాను మన నుంచి ఇతర భాషల్లోకి వెళ్ళాలి అనుకున్నాను అనుకున్నాను వేరే ఏం అనలేదు.

 

త్రివిక్రమ్ గారితో ఇంకో సినిమా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది?

త్రివిక్రమ్ గారితో సినిమా అంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. తను రాసిచ్చే డైలాగ్స్ లో నేను యాక్ట్ చెయ్యడం కోసం ఎదురు చూస్తాను. తాను నాకు ఒక సీన్ కోసం చెప్పడం గాని అన్నీ చాలా ఎంజాయ్ చేస్తాను. తన వర్క్ కోసం అయితే ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

 

థమన్ వర్క్ కోసం చెప్పండి.?

థమన్ ఈ సినిమాకి పెట్టేసాడు. తను ఇచ్చే ప్రతి పాట హిట్ అవుతుంది. కళావతి ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. మొదట్లో అయితే ఈ సాంగ్ కోసం అంతా చాలా అనుకున్నాం కానీ థమన్ అప్పుడు చెప్పాడు నమ్మండి ఈ సాంగ్ చాలా ఎపడ్డ హిట్ అవుతుంది అన్నాడు అలాగే అయ్యింది. సినిమాకి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తప్పకుండా అంతా దానికోసం మాట్లాడుతారు.

 

కీర్తి సురేష్ కోసం చెప్పండి?

ఆమె ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకింగ్ లా ఉంటుంది డెఫినిట్ గా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మా ఇద్దరి కెమిస్ట్రీ ఖచ్చితంగా అందరు ఎంజాయ్ చేస్తారు.

 

సముద్రఖని గాను ఈ సినిమాలోకి ఎలా వచ్చారు?

ఆయన రోల్ కోసం నేను డైరెక్టర్ గాను చాలా డిస్కర్ చేసాం, చాలామంది పెద్ద పెద్ద పేర్లు కూడా అనుకున్నాం కానీ లాస్ట్ కి ఆ రోల్ లో సముద్రఖని గారు సెట్ అవుతారు అనిపించింది. సో ఆయన్ని తీసుకొచ్చాం ఈ సినిమాలో ఆయన అదరగొట్టేసారు.

సంబంధిత సమాచారం :

సంబంధిత సమాచారం :