ఇంటర్వ్యూ : మాల్వికా శర్మ – రామ్ కెమెరా ముందు వస్తే ఆ ఎనర్జీ అమేజింగ్ గా ఉంటుంది

ఇంటర్వ్యూ : మాల్వికా శర్మ – రామ్ కెమెరా ముందు వస్తే ఆ ఎనర్జీ అమేజింగ్ గా ఉంటుంది

Published on Jan 6, 2021 4:06 PM IST

మాస్ మహారాజ్ రవితేజతో “నేల టికెట్” అనే సినిమాలో చేసి గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాల్వికా శర్మ. మరి ఇప్పుడు ఈ గ్లామరస్ హీరోయిన్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా చేసిన “రెడ్” చిత్రంతో ఈ సంక్రాంతికి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రానుంది. మరి ఈ సందర్భంలో ఆమె నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాము. మరి ఆమె ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.

మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది?

నా ఫస్ట్ ఫిల్మ్ నేల టిక్కెట్ తర్వాత ఇక్కడే హైదరాబాద్ లో నా “లా” కోర్స్ చేస్తున్నాను. ఆ టైం లోనే స్రవంతి రవి కిషోర్ గారి ఆఫీస్ నుంచి కలవమని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళాక లుక్ టెస్ట్ చేసి చూసారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాను.

రామ్ తో సినిమా ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది?

ఫ్రాంక్ గా చెప్పాలి అంటే రామ్ చాలా రిజర్వ్డ్ మనిషి. కానీ ఒక్కసారి కనుక కెమెరా ముందుకు వచ్చాడు అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అమేజింగ్ గా ఉంటాయి. తనతో అలాగే స్రవంతి మూవీస్ వాళ్ళతో మంచి వర్క్ ఎక్స్ పీరియన్స్ నాకు అనిపించింది.

రెడ్ ఒరిజినల్ వెర్షన్ ను మీరు చూసారా?

పూర్తిగా కాదు కానీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను తమిళ్ వెర్షన్ లో చూసాను. కానీ అవి తెలుగులో ఇంకా ఇంప్రూవ్డ్ గా ఉంటాయి.

డైరెక్టర్ కిషోర్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది?

కిషోర్ సార్ సెట్స్ లో చాలా కామ్ గా కూల్ గా ఉంటారు. తాను అనుకున్నది ఆర్టిస్ట్ నుంచి తెప్పించడానికి చాలా ఓపిగ్గా ప్రతీ సీన్ ను వివరిస్తారు. అలాగే ఆయన చాలా క్లారిటీగా కూడా ఉంటారు.

“నువ్వే నువ్వే” సాంగ్ కు అంత రెస్పాన్స్ వచ్చాక ఏమనిపించింది?

ఆ సాంగ్ కు అంత రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సాంగ్ ను లాక్ డౌన్ కు కొన్ని నెలల ముందే ఇటలీలో షూట్ చేసాము.

మరి సినిమాలు మీ చదువుని ఎలా బ్యాలెన్స్ చేశారు?

ఎల్ ఎల్ ఎం చెయ్యాలి అనేది నా డ్రీం కానీ మరోపక్క సినిమాల్లో చెయ్యడం అనేది కూడా నా ప్యాషన్..సో ఈ రెండు ఒకేసారి చెయ్యడం నాకేం ఇబ్బందిగా లేదు. ఈ టాస్క్ ను ఎంజాయ్ చేస్తున్నాను.

లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడిపారు మరి?

మొదట్లో అయితే చాలానే వెబ్ సిరీస్ లు చూసేసాను ఆ మూడు నెలల తర్వాత నా లా కోర్స్ అసైన్మెంట్స్ లో బిజీ అయ్యిపోయా.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా?

ప్రస్తుతానికి తెలుగు అలాగే తమిళ్ రెండు లాంగ్వేజెస్ లో కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను ఇంకా ఇవి కన్ఫర్మ్ చెయ్యలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు