ఇంటర్వ్యూ : నాగ శౌర్య – “కృష్ణ వ్రింద విహారి” మా అమ్మకి బాగా నచ్చిన కథ..

ఇంటర్వ్యూ : నాగ శౌర్య – “కృష్ణ వ్రింద విహారి” మా అమ్మకి బాగా నచ్చిన కథ..

Published on Sep 22, 2022 2:36 PM IST

 

ఈ వారం థియేటర్స్ లో మంచి బజ్ నడుమ రిలీజ్ కి రెడీగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా మరో యంగ్ బ్యూటీ షిర్లే షెటియా హీరోయిన్ గా నటించిన యూత్ ఫుల్ రొమాంటివ్ ఎంటర్టైనర్ చిత్రం “కృష్ణ వ్రింద విహారి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాగ శౌర్య లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

చెప్పండి ఈ సినిమా ఎలా మీ దగ్గరకి వచ్చింది.?

ఈ చిత్రం ఇంకా కోవిడ్ ఎంటర్ కాకముందే అనీష్ నా దగ్గరకి ఈ కథ తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం వినగానే నాకు బాగా నచ్చేసింది. దీనితో వెంటనే ఓకే చేసేసి వెంటనే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పాను. కానీ అప్పుడు కరోనా ఎంటర్ కావడం పరిస్థితులు మారిపోవడంతో ఇక్కడకి వరకు వచ్చింది.

 

సినిమాలో మీ రోల్ కోసం చెప్పండి? ఏ అంశం మీకు బాగా నచ్చింది?

సినిమాలో నేను ఓ బ్రాహ్మణ కుర్రాడిలా కనిపిస్తాను అలాగే నా రోల్ చాలా ఫన్ గా కూడా ఉంటుంది, అలాగే సినిమాలో ఫామిలీ సీన్స్ కామెడీ నాకు బాగా నచ్చాయి. డెఫినెట్ గా ఈ సినిమా ఎలా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది అనే విషయంలో మాత్రం నాకు బాగా ఎగ్జైటింగ్ గా ఉంది.

 

ఎవరు చెయ్యని విధంగా పాదయాత్ర అంటూ ప్రమోట్ చేశారు దీని కోసం చెప్పండి?

ఇది నిజంగా చాలా కష్టంగా అనిపించింది. ఈ ప్రమోషన్స్ లో చాలా నేను చాలా వీక్ కూడా అయ్యిపోయా కానీ ఈ పాదయాత్రలో చాలా మందిని కలుసుకోవడం వారి నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. అది బాగా అనిపించింది.

 

రాధికా గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ కోసం చెప్పండి

రాధికా గారు తప్ప ఈ రోల్ కి అయితే మరొకరు న్యాయం చెయ్యలేరు అనిపించింది. చాలా మంచి రోల్ తాను ఈ సినిమాలో చేశారు. ఖచ్చితంగా ఆడియెన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు.

 

మరి మళ్ళీ మాస్ సినిమాలు చేసే ఆలోచన ఏమన్నా ఉందా?

పర్సనల్ గా చెప్పాలి అంటే మాస్ జానర్ నాకు బాగా ఇష్టమైంది. అందుకే నాకూ మాస్ సినిమాలు చెయ్యడం అంటే ఇష్టమే అలా కొన్ని సినిమాలు చేశా కానీ అవి క్లిక్ అవ్వలేదు. మరింత మంచి కథలతో డైరెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తాను.

 

ఈ సినిమాకి నిర్మాణంలో మీ పాత్ర కూడా ఉంది దాని కోసం చెప్పండి?

ఓ రోజు రాత్రి మా అమ్మ గారితో కలిసి కూర్చొని డిన్నర్ చేస్తున్నపుడు క్యాజువల్ గా నా లైనప్ కోసం మాటలు వచ్చాయి. ఆ టైం లో నేను ఈ సినిమా కథ కోసం చెప్పను. అది మా అమ్మకి బాగా నచ్చేసింది. దీనితో మన బ్యానర్ లోనే సినిమా ఎందుకు చెయ్యకూడదు అని అడగ్గా అలా ప్రొడ్యూసర్ గా కూడా మారాల్సి వచ్చింది.

 

ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి..

ప్రస్తుతం ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి షూట్ కంప్లీట్ చేసేసాం త్వరలోనే దాని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే “కృష్ణ వ్రింద విహారి” రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు