ఇంటర్వ్యూ : నాగార్జున – “ది ఘోస్ట్” సినిమా నేను చాలా ఇష్టంతో చేసాను..

ఇంటర్వ్యూ : నాగార్జున – “ది ఘోస్ట్” సినిమా నేను చాలా ఇష్టంతో చేసాను..

Published on Oct 4, 2022 5:01 PM IST

ఈ దసరా కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సాలిడ్ హిట్ ఎంటర్టైనర్ చిత్రం “ది ఘోస్ట్” కూడా ఒకటి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను సినిమా పట్ల ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం రండి.

ఈ సినిమాకి మీలో చాలా కష్టం, ఇష్టం కనిపిస్తున్నాయి, సినిమాలో అంతలా మీకు నచ్చింది ఏంటి?

నా ప్రతి సినిమాల్లో కూడా కష్టం కనిపిస్తుంది, కానీ ఈ సినిమాకి నాకు ఇష్టం ఏర్పడింది. సినిమా గొప్ప కథ అని చెప్పను. నేనెప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను అది ఈ చిత్రంలో కనిపిస్తుంది. చాలా కొత్త ప్రెజెంటేషన్, యాక్షన్ సీక్వెన్స్ లు ప్లస్ సినిమాలో సెంటిమెంట్ చాలా బాగుంటాయి. నేను సినిమా చూసి కూడా ప్రవీణ్ వర్క్ తో షాకయ్యను. అంత బాగా తీసాడు అతను.

 

మీ కాంబోలో ‘రెయిడ్’ రీమేక్ ప్లాన్ చేశారంటగా?

ముందు రెయిడ్ రీమేక్ కోసం అనుకున్నారు కానీ నాకే రీమేక్ చెయ్యాలి అని అనుకోలేదు. ఎందుకంటే హిందీ మార్కెట్ లోకి వెళ్ళడానికి మళ్ళీ ఎందుకు హిందీ సినిమానే తీసుకోవడం అని నాకు పర్సనల్ గా అనిపించింది.

 

ఈ చిత్రం హిందీ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది?

ముందు ఈ సినిమా ఇక్కడ అందుకునే రిజల్ట్ ని బట్టి హిందీ లో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఫిక్స్ చేస్తాము.

 

మీ ఫ్రెండ్ చిరంజీవి గారి సినిమా తో పోటీగా వస్తున్నారు ఎలా ఉంది?

డెఫినెట్ గా మంచి ఫ్రెండ్స్ మేము చిరు నుంచి ఎప్పుడు మంచి సపోర్ట్ ఉంటుంది. పోటీ మాటకి వస్తే రీసెంట్ గా ఎన్నో సినిమాలు ఒకే రోజు వచ్చాయి హిట్ అయ్యాయి. అలాగే ఇప్పుడు కూడా అదే అవుతుంది అని నమ్ముతున్నాను.

 

ప్రస్తుతం నడుస్తున్న రీ రిలీజ్ లలో మీ “శివ” రీ రిలీజ్ కూడా ఉంటుందా?

తప్పకుండా ప్లాన్ చేస్తున్నాం. దాన్ని 4కే లో రీ మాస్టర్ ప్లాన్ చేసే పనిలో ఉన్నాం. ఇంకా వీటితో పాటుగా చాలా సినిమాలు అనుకుంటున్నాం. కొన్ని సినిమాలు నెగిటివ్ లు అయితే ఇప్పటికే ఆవిరి కూడా అయిపోయాయి. ఉన్న వాటి వరకు డెఫినెట్ గా ప్లాన్స్ ఉన్నాయి.

 

సోనాల్ చౌహన్ కోసం చెప్పండి

మా ఇద్దరి మధ్య మంచి యాక్షన్ సీక్వెన్స్ లే ఎక్కువ ఉన్నాయి. ఆమె చాలా ఎక్కువ కష్టపడుతుంది. కొన్ని వారాల ముందే ట్రైనింగ్ తీసుకొని చాలా డెడికేషన్ తో వర్క్ చేసింది.

 

ఓటిటి లో కూడా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా?

ఉన్నాయి చాలా పెద్ద బ్యానర్స్ నుంచే ఉన్నాయి కానీ నాకు పెద్దగా ఏవి నచ్చట్లేదు. మినిమమ్ మూడు సీజన్లు అయినా ఉండాలి కదా అనుకుంటున్నాను. మంచి కంటెంట్ కుదిరితే నేషనల్ లెవెల్ లోనే ఎంట్రీ లోనే ఉంటుంది.

 

‘బ్రహ్మాస్త్ర’ తర్వాత బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్స్ ఏమన్నా వచ్చాయా?

అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. దాని తర్వాత కూడా ఉన్నాయి. కానీ టైం కుదరట్లేదు అందుకే చేసే సమయం సెట్ అవ్వట్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు