ఇంటర్వ్యూ : నితిన్ – “చెక్” కంటే ముందు యేలేటి వేరే స్క్రిప్ట్ చెప్పారు..

ఇంటర్వ్యూ : నితిన్ – “చెక్” కంటే ముందు యేలేటి వేరే స్క్రిప్ట్ చెప్పారు..

Published on Feb 24, 2021 5:22 PM IST

మన టాలీవుడ్ టైర్ 2 టాప్ హీరోల్లో మొట్ట మొదటగా నిలిచేది యూత్ స్టార్ నితిన్ పేరే అని చెప్పాలి. చాలా కాలం అనంతరం “భీష్మ”తో ఒక సాలిడ్ కం బ్యాక్ అందుకున్న ఈ యువ హీరో ఇప్పుడు ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ చంద్రశేఖర్ యేలేటితో తీసిన “చెక్” సినిమాతో ఈ ఫిబ్రవరి 26న పలకరించడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా నితిన్ నుంచి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ..ఇందులో తాను ఎలాంటి విషయాలు చెప్పాడో చూద్దాం.

చెక్ సినిమా ఎలా వచ్చింది.?

నేను భీష్మ, చెక్ రెండు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నాను.ఒకటి కమెర్షియల్ సినిమా ఇంకొకటి డిఫరెంట్ సినిమా చెయ్యాలని అనుకున్నా, కానీ లాక్ డౌన్ వల్ల భీష్మ ముందు వచ్చింది చెక్ డిలే అయ్యి ఇప్పటికి వచ్చింది.

యేలేటి గారితో సినిమా చెయ్యాలని ఎప్పుడు అనిపించింది?

మూడు ప్లాప్ సినిమాల తర్వాత ఒక కమెర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ఒకటి ప్రయోగం చెయ్యాలి అనుకున్నాను. ఇక యేలేటి గారి డిఫరెంట్ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. సో అప్పుడు అలా ఒప్పుకున్నాను.

యేలేటి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?

నాకు ముందు యేలేటి ఈ స్క్రిప్ట్ కాదు వేరే స్క్రిప్ట్ చెప్పారు. అది బాగానే అనిపించింది రెండు నెలలు డెవలప్ చెయ్యడానికి తీసుకున్నారు కానీ తర్వాత దానిపై అంత కాన్ఫిడెన్స్ గా తనకి కూడా అనిపించలేదు నాకు అదే అనిపించింది. అప్పుడు ఈ లైన్ చెప్తే వెంటనే ఓకె చేసేసా. ఎందుకంటే రొటీన్ రొమాన్స్ ఉండదు, ఒకటే సాంగ్ మొత్తం జైల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముఖ్యంగా క్లైమాక్స్ అయితే హైలైట్ అందుకే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది.

ఈ రోల్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

సెపరేట్ గా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. యేలేటి గారు ఏం చెప్తే అదే ఫాలో అయ్యాను. ఇంతకు ముందు చేసిన సినిమాల్లో అంటే కలిసి నవ్వుకోడం లాంటివి ఉండేవి కానీ ఈ సినిమా సెట్స్ లో చాలా కామ్ గా ఉండే వాడిని.

ఇందులో డ్యూయల్ రోల్స్ ఏమన్నా చేస్తున్నారా లేక.?

లేదు లేదు ఇందులో ఎలాంటి డ్యూయల్ రోల్స్ లేవు సింగిల్ రోల్ మాత్రమే. ఆ డిఫరెంట్ లూకా అంతా జస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే ఉంటుంది అంతే.

ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు?

నేను సినిమా చూసాను. మేము సినిమా చేసింది ఒక కొంత వరకు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల మరో లెవెల్లో అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ గారు కొన్ని చోట్ల ఇచ్చిన ఆర్ ఆర్ కి అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి.

మీ పెళ్లయ్యాక వస్తున్న ఫస్ట్ సినిమా ఇది మీరు మీ భార్య ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారు?

ఎగ్జైట్మెంట్ ఏం అని కాదు కానీ హిట్ అయితే గుడ్ లక్ అంటారు లేదంటే బ్యాడ్ లక్ అంటారు అంతే. కానీ సినిమా టీజర్ ట్రైలర్స్ మాత్రం నా భార్యకి బాగా నచ్చాయి.

సంవత్సరానికి మూడు సినిమాలు చెయ్యాలని ప్లాన్ ఏమన్నా ఉందా?

ఎస్ అది మాత్రం నా మైండ్ లో ఉంది. లాస్ట్ సంవత్సరం కరోనా వల్ల ఇప్పుడు రెండు సినిమాలు వస్తున్నాయి కానీ నేను మాత్రం ఎక్కువ సినిమాలు చెయ్యాలి అనుకుంటున్నాను. అన్ని కరెక్ట్ గా ఉంటే “పవర్ పేట” ఈ డిసెంబర్ లోనే రావొచ్చు.

మీ బ్యానర్ నుంచి కళ్యాణ్ గారి సినిమా ఉంటుందా.?ఈ సినిమాలో రిఫరెన్సెస్ కూడా ఉన్నాయా?

కళ్యాణ్ గారితో మా బ్యానర్ లో ప్రస్తుతానికి ఇంకా ఏమి అనుకోలేదు. ఇంకా ఈ సినిమాలో అయితే ఆ కంటెంట్ కు అసలు స్కోప్ ఏం లేదు, లేకుండానే ఆయన పోస్టర్ ఏమన్నా తీసుకెళ్లి గోడ మీద అతికించుకుంటామా(నవ్వతూ).

రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ రోల్స్ కోసం ఏమన్నా చెప్పండి?

రకుల్ చాలా మంచి యాక్ట్రెస్. మా ఇద్దరికీ ఈ సినిమాలో ఎలాంటి లవ్ ట్రాక్ ఉండదు ఆ రిలేటెడ్ ఏం ఉండవు అయినప్పటికీ తాను ఈ రోల్ చేసింది. తన లాయర్ రోల్ లో ఆమె చాలా బాగా చేసింది. ఇక ప్రియాకి ఇది తెలుగు ఫస్ట్ సినిమా అయినా బాగా చేసింది సినిమాలో ఎక్కువగా ఉండదు కానీ ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉంటుంది.

పవర్ పేట సినిమా కోసం చెప్పండి?

నా మొత్తం కెరీర్ లోనే అది ఒక ఛాలెంజింగ్ సినిమా. మొత్తం మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తా 20 ఏళ్ళు ఒకటి 40, 60 ఏళ్ల వయసు రోల్స్ లో కనిపిస్తా. దానికి ఆ ప్రోస్థటిక్ మేకప్ అంతా చాలా సమయం పడుతుంది.

చెక్ సినిమాను డబ్బింగ్ చేసే అవకాశం కూడా ఉందా?హిందీలో కూడా మీ సినిమాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయిగా..

ఇంకా ఎమ్ లేదు, కానీ పవర్ పేట సినిమా అయితే తమిళ్ చెయ్యడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక హిందీలో అంటే అవన్నీ యూట్యూబ్ వ్యూస్ వాటిని నమ్ముకోడం కాదు థియేటర్స్ కి వచ్చి చూస్తే అప్పుడు ఏమన్నా అనుకోవచ్చు అంతే. వాటిని చూసి స్టార్ అనుకోకూడదు.

మల్టీ స్టారర్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందా? ఆల్రెడీ ఒకటి మిస్ అయ్యినట్టుంది?

ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారితోనే చెయ్యాలి అని ఉంది. అప్పుడు హరీష్ శంకర్ అండ్ శర్వానంద్ తో దాగుడు మూతలు అనే ప్రాజెక్ట్ చేసాం కానీ సెట్ అవ్వలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు