ఇంటర్వ్యూ : నిర్మాత నాగవంశీ – ‘జెర్సీ’ కి రెండు నేషనల్ అవార్డ్స్ రావడం బోనస్

ఇంటర్వ్యూ : నిర్మాత నాగవంశీ – ‘జెర్సీ’ కి రెండు నేషనల్ అవార్డ్స్ రావడం బోనస్

Published on Mar 23, 2021 4:00 PM IST

నిన్ననే జాతీయ 67వ జాతీయ ఉత్తమ చిత్రాల అవార్డుల ఫలితాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” చిత్రానికి రెండు జాతీయ స్థాయి పురష్కరాలు వరించాయి. మరి ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ మీడియా ముఖంగా తన ఆనందం వ్యక్తం చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఏ విషయాలు తాను పంచుకున్నారో చూద్దాం.

 

‘జెర్సీ’కి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి అనగానే మీ రియాక్షన్ ఏంటి?

అది నాకు మా టీం కు చాలా ఆనందం అనిపించింది. మేము సినిమా చేస్తున్నప్పుడే ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని అనుకున్నాం ఇప్పుడు కేంద్రం నుంచే ఇంత గుర్తింపు రావడం దానికి మరో బోనస్ అని అనుకుంటున్నా.

 

మరి నాని గారి రియాక్షన్ ఏంటి?

తాను ఆల్రెడీ వీడియో బైట్ లో చెప్పినట్టుగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు దగ్గరలో లేరు కాబట్టి పర్సనల్ గా కలవడం జరగలేదు. ఈ హ్యాపీ మూమెంట్ పై ఖచ్చితంగా ఒక రీయూనియన్ ను ప్లాన్ చేస్తాం.

 

ఎడిటింగ్ లో కూడా జెర్సీ కు అవార్డు వచ్చింది దీనిపై ఏం చెప్తారు?

అవును అందుకు మా ఎడిటర్ నవీన్ నూలికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. పోస్ట్ ప్రొడక్షన్ టైం లో డైరెక్టర్ గౌతమ్ తో ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉండేవాడు. ఫైనల్ గా తన బెస్ట్ కట్ ను జెర్సీ కి ఇచ్చాడు. ఇప్పుడు తన వర్క్ కి జాతీయ అవార్డు దక్కింది.

 

ఇలాంటి ఒక సీరియస్ డ్రామా కు నాని ఎలా ఓకే చెప్పారు?

ఈ సినిమా చెయ్యడానికి ముందు నాని “నిన్ను కోరి”, “ఎం సి ఏ” లాంటి సినిమాలతో హిట్స్ లో ఉన్నాడు. ఆ టైం లోనే గౌతమ్ కాస్త భయంతోనే స్క్రిప్ట్ వినిపించడానికి వెళ్ళాడు. కానీ నాని ఒక్కసారి ఈ స్క్రిప్ట్ విన్నాక ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసారు. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది.

 

ఇప్పుడు ఈ అవార్డ్ విన్నింగ్ తో మీపై మరింత భాద్యత పడిందిగా..

అది భాద్యత అని కాదు కానీ మా బ్యానర్ లో ఖచ్చితంగా మరిన్ని మంచి సినిమాలు తేవడానికి ఖచ్చితంగా కేర్ తీసుకుంటామని చెప్పగలను.

 

మరి మహేష్ గారి మహర్షి కి కూడా అవార్డ్ వచ్చింది దానిపై ఏమన్నా?

అవును, ఆ సినిమా కూడా ఖచ్చితంగా అందుకు అర్హత ఉన్నదే. ఆ సినిమాలో ఉండే పాయింట్ రైతుల కోసం చూపించిన విధానం, మహేష్ గారి అద్భుతమైన ఎఫర్ట్స్ కనిపించాయి.

 

మరి ఇప్పుడు రాబోతున్న “రంగ్ దే” కోసం ఏం చెప్తారు?

ఈ సినిమా ఓ కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లా ఉంటుంది. ఎమోషన్స్, నితిన్, కీర్తిల మధ్య లవ్ స్టోరీ, కెమిస్ట్రీ కానీ అందులో హైలైట్ గా ఉంటాయి.

 

పవన్ – రానా సినిమా కోసం ఏమన్నా చెప్పండి..

ఈ సినిమా ఆల్రెడీ నలభై శాతం అయ్యిపోయింది. అలాగే మే ఎండ్ కి అలా మొత్తం షూట్ కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాం.

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

తారక్ – త్రివిక్రమ్ కాంబోలో అనుకున్న ప్రాజెక్ట్ సాధ్యమైనంత త్వరగా స్టార్ట్ చేసేయాలని చూస్తున్నారు. ఆ నెక్స్ట్ రెండేళ్లకు కూడా మంచి లైనప్ మా నుంచి ఉంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు