ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – “ఆచార్య” లో మా ఇద్దరి పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

ఇంటర్వ్యూ : రామ్ చరణ్ – “ఆచార్య” లో మా ఇద్దరి పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి.

Published on Apr 24, 2022 10:54 PM IST

లేటెస్ట్ గా భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

చెప్పండి కొరటాల గారు కథ చెప్పినపుడు మీ పాత్రలో ఏ అంశం బాగా నచ్చింది?

ముందు నేను ఈ సినిమా లోకి నిర్మాతగా ఎంటర్ అయ్యాను తప్ప నటుడుగా కాదు. కానీ తర్వాత నటుడుగా కూడా తర్వాత ఉంటానని కొంచెం చిన్న పాత్ర ఉంటుంది అని చెప్పారు. కథకి ఇది చాలా ముఖ్యం అని తెలుసు. కానీ తర్వాత అది మరింత పెరిగింది. నాకు నచ్చిన నచ్చిన పాయింట్ అనేమీ లేదు కానీ ఎప్పుడు నుంచో సినిమా అనుకున్నాం పైగా ఇందులో నాన్న గారితో సినిమా అవ్వడంతో ఓకే చేసేసాను.

 

ఈ కథ ముందు చిరు గారికి చెప్పినప్పుడే మీరే ఉంటారని తెలుసా?

లేదు ఈ రోల్ కి నేను అయితే ముందు ఆప్షన్ కాదు ముందు వేరే ప్లానింగ్స్ ఉండి ఉండొచ్చు. నేను అప్పటికే రాజమౌళి గారితో సినిమాలో ఉన్నాను. తర్వాత సినిమా పరిస్థితులు మారి నాన్న గారు కొరటాల గారితో మాట్లాడి ఆయన ఆచార్య కి రావడం తర్వాత నేను ఎంటర్ అవ్వడం జరిగాయి.

 

చెప్పండి సినిమాలో మీ ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయి.?

నాన్న గారిది నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ అంతిమంగా ధర్మం కోసమే నిలబడతారు. నేను గురుకులంలో కనిపించే అబ్బాయిలా కనిపిస్తాను. అలాగే నాన్న గారిది ఒక ఫైటర్ లా కనిపిస్తారు. అలాంటి ఇద్దరు ఎలా కలుస్తారు కలిస్తే ఎలా ఉంటుందో అనేది శివ గారు తీశారు.

 

RRR కి ఆచార్య కి ఎలా ప్రిపేర్ అయ్యారు?

నా రోల్ కి కష్టపడడం అనేది ఎక్కువ అనే దాని కన్నా నాకు బాగా నచ్చిన పాత్రలు ఇవి. వాటిని ఆల్రెడీ పేపర్ మీదనే శివ గారు రాజమౌళి గారు రాసేశారు. వాటిని నేను బాగా ఇష్టంగా చేశాను సో నాకు అంత కష్టంగా కన్నా ఇస్టంగానే అనిపించాయి.

 

మీరు ఈ సినిమాలోకి యాడ్ అయ్యాక ఏమన్నా మార్పులు చేసారా?

లేదు ఎక్కడా కూడా ఎలాంటి మార్పులు లేవు. ఇద్దరి పాత్రలకి కూడా చాలా తేడా ఉంటుంది. నిజానికి ఈ పాత్రలు వేరే ఏ హీరోలు చేసినా కూడా హిట్ అవుతాయి. అలాగే చాలా వరకు సీన్స్ కూడా చాలా ఆర్గానిక్ గా వచ్చిన సీన్స్ ఉంటాయి తప్ప ఎక్కడా కూడా కావాలని యాడ్ చేసిన సీన్స్ ఉండవు.

 

మరి పాన్ ఇండియా లెవెల్లో RRR అంత సక్సెస్ అయ్యాక ఈ సినిమాని ఎందుకు ప్లాన్ చెయ్యలేదు?

ఇవన్నీ చాలా త్వరగా అయ్యిపోయాయి. మార్చ్ లో RRR వచ్చేసింది. అప్పుడు నుంచి స్టార్ట్ చేసినా చాలా వరకు పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్లాన్స్ ఉంటాయి. అందుకే కొన్ని నెలల తర్వాత చెయ్యాలని అనుకున్నాం.

 

మీ బ్యానర్ లో కళ్యాణ్ గారి సినిమా గాని కళ్యాణ్ గారి బ్యానర్ లో మీ సినిమా గాని అలా ఏమన్నా ఉన్నాయా?

ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఇద్దరికి కూడా కుదరాలి. బాబాయ్ తో సినిమా నేను చేసినా ఆయన ప్రొడ్యూసర్ గానే కాకుండా కో ప్రొడక్షన్ లో ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఆయన కూడా ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఒకే చేసేసారు. చాలా బిజీ చేసేసారు. వారికి నాలా కో ప్రొడ్యూసర్ ఉంటే ఖచ్చితంగా చేస్తాము.

 

పూజా హెగ్డే తో వర్క్ ఎక్స్ పీరియన్స్ కోసం చెప్పండి?

పూజా హెగ్డే సూపర్ అండి చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ముందే “రంగస్థలం”లో ఓ సాంగ్ చేసాం రేపు సినిమాలో మా కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పటికే మోస్ట్ బిజీ యాక్టర్స్ గా ఆమె ఉంది.

 

స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నాయా?

అలా ఏమి లేదు రెస్ట్రిక్షన్స్ నేనేమి పెట్టుకోలేదు. ఏ డైరెక్టర్ తో అయినా కూడా పర్ఫెక్ట్ గా నాకు సెట్ చేసి తీసుకొస్తే నేను డెఫినెట్ గా ఓకే చేస్తాను. ఒక సినిమా తర్వాత ఈ తరహా సినిమానే చెయ్యాలి అనేవి పెట్టుకోను నేను అంతా వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది.

 

లేటెస్ట్ వచ్చిన మీ సినిమా గాని పుష్ప, కేజీయఫ్ ల సక్సెస్ తో సౌత్ సినిమా ఇంత పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది?

నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇది వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే అనడం అక్కడి హీరోస్ కోసమే చెప్పడం జరిగేది కానీ ఇప్పుడు మన సినిమాలు టోటల్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందాక అన్నట్టు మనం కూడా బాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యాలి వాళ్ళు మన హీరోలతో సినిమాలు చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు