ఇంటర్వ్యూ : సుధీర్ బాబు – “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” తర్వాత కృతికి మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయి

Published on Sep 15, 2022 5:07 pm IST

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కించిన మరో చిత్రం ఇది కాగా ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. మరి ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా సుధీర్ బాబు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

చెప్పండి సినిమా ఎలా ఉండబోతుంది?

పూర్తిగా అయితే సినిమాలోనే మీరు చూడాలి. ట్రైలర్ తో చాల వరకు కూడా మీకు అర్ధం అయ్యి ఉంటుంది. సినిమా అంటే ఇష్టం లేని ఓ ఆర్థడాక్స్ ఫామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఓ డైరెక్టర్ తన సినిమా కోసం ఎలా ఒప్పిస్తాడు చేస్తే సినిమా ఎలా ఉంటుంది దానివల్ల ఏమన్నా సమస్యలు వస్తాయా అనేది సినిమాలో మీరు చూడాలి.

 

డైరెక్టర్ తో ఇప్పటికే చాలా సినిమాలు చేసారు ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి?

మొన్న ప్రీ రిలీజ్ లో కూడా చెప్పాను సినిమాలో డైలాగ్ ఉంటుంది. మనం సినిమా చూస్తూ ఉంటాం అనుకుంటాం కానీ సినిమానే మనల్ని చూసుకుంటుంది అని అలాగే మా కాంబో కూడా సెట్ అవుతుంది. ఇంద్రగంటి గారు నాకోసం ని కథలు రాయలేదు ఆయన అనుకున్న స్టోరీ ని నటుడుగా నేను సెట్ అవుతానని అలాగే నాకు కూడా కథ నచ్చితే ఓకే చెయ్యడం వల్ల కాంబోలో ఇన్ని సినిమాలు వచ్చాయి. అయన అందరి దర్శకుల్లా కాకుండా ఎపుడు కూడా ముందు కథ రాసుకొని సినిమా దానికి ఎవరు సెట్ అవుతారు అని చూసుకుంటారు.

 

చాలా మంది డైరెక్టర్స్ ని చూసారు ఇపుడు డైరెక్టర్ రోల్ చేశారు ఎలా అనిపిస్తుంది?

ఈ సినిమాలో కనిపించే డైరెక్టర్స్ లాంటి వాళ్ళు తక్కువ మందే ఉంటారు, మన వాళ్ళు చాలా వరకు వాళ్ళ కేర్ కోసం కూడా చూసుకోకుండా చేస్తుంటారు. అలాగే ఇంతకూ ముందు సినిమాలకు కాదు కానీ ఈ సినిమా వరకు అయితే డైరెక్టర్ గా ఇంద్రగంటి గారు కనిపించలేదు.

 

వివేక్ సాగర్ సంగీతం కోసం చెప్పండి.?

వివేక్ సాగర్ కి ఇంద్రగంటి గారికి మంచిగా కుదిరింది. తన సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ కానీ ఐటెం సాంగ్ లాంటివి కానీ ఉండవు. అలాగే వివేక్ కూడా ఎప్పుడు అలాంటి మ్యూజిక్ చెయ్యలేదు ఇప్పటివరకు చాల మంచి మ్యూజిక్ తాను ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకి కూడా అంతకు మించే మంచి వర్క్ తాను చేసాడు.

 

హీరోయిన్ కృతి శెట్టి కోసం చెప్పండి?

కృతి చాలా మంచి పెర్ఫామర్, నిజానికి ఉప్పెన కన్నా ముందే ఈ సినిమాకి ఆమె ఓకే చెప్పింది. చిన్న ఏజ్ లో కూడా తాను చాలా మెచ్యూర్ గా నటిస్తుంది. ఉప్పెన కన్నా ఈ సినిమాలో నటిగా తనలో కొత్త కోణం కనిపిస్తుంది. అప్పుడు ఉప్పెన వల్ల ఎలా అయితే మంచి ఆఫర్స్ వచ్చాయో ఇప్పుడు ఈ సినిమాలో తన నటన చూసాక కూడా ఆమె నటన చూసి మరిన్ని రోల్స్ ఆమెకి తప్పకుండా వస్తాయి.

 

మీకు డైరెక్టర్ గా కూడా చెయ్యాలని ఉన్నట్టు విన్నాం..

డైరెక్టర్ గా అంటే అనుకున్నాను కానీ ఎప్పుడు నుంచో ఉంది కానీ ప్రస్తుతానికి యాక్టర్ గా మాత్రమే ఉందాం అనుకుంటున్నాను. ఏవో కొన్ని లైన్స్ రాసుకుంటూ ఉంటాను ఇదంతా చాలా వేరేగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే డైరెక్షన్ పై ఆలోచన లేదు.

 

బాలీవుడ్ నుంచి ఏమన్నా ఆఫర్స్ వస్తున్నాయా?

వచ్చాయి.. రీసెంట్ బ్రహ్మాస్త్ర కూడా వచ్చింది. కానీ ఆ టైం లో సమ్మోహనం చేస్తున్నాను అందుకే అవ్వలేదు.

 

ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి.

ప్రస్తుతం అయితే మామా మశ్చీంద్ర, నెక్స్ట్ హంట్ కూడా ఉంది. అలాగే యూవీ క్రియేషన్స్ తో ఒక సినిమా ఉంది అలాగే జ్ఞ్యాన సాగర్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. వీటిలో కొన్ని ఆల్ మోస్ట్ షూట్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ ఏడాది లోనే ఇంకో రెండు రిలీజ్ లు ఉండొచ్చు.

సంబంధిత సమాచారం :