ఇంటర్వ్యూ: సందీప్ కిషన్ – ‘మజాకా’లో చాలా సర్ప్రైజ్ లు ఉంటాయి

ఇంటర్వ్యూ: సందీప్ కిషన్ – ‘మజాకా’లో చాలా సర్ప్రైజ్ లు ఉంటాయి

Published on Feb 23, 2025 10:10 AM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన సందీప్ కిషన్ హీరోగా యంగ్ బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్ గా దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మజాకా”. మరి ఈ శుక్రవారం అలరించేందుకు వచ్చేస్తున్న ఈ సినిమా విడుదలకి ముందు చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇలా హీరో కూడా లేటెస్ట్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి తాను ఈ ఇంటర్వ్యూ లో ఎలాంటి విశేషాలు ఈ సినిమా కోసం పంచుకున్నాడో చూద్దాం రండి.

మజాకా ఫస్ట్ టైం మీరు చేస్తున్న కామెడీ రోల్ అనుకోవచ్చా?

కామెడీ సినిమాలు గతంలో చేశాను. బీరువాలో నా క్యారెక్టర్ కి పుల్ లెంత్ కామెడీ టైమింగ్ వుంటుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కామెడీ సినిమానే కానీ అందులో నా క్యారెక్టర్ టెన్షన్ లో వుంటుంది. మజాకా మాత్రం నేను చేసిన ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్. క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా వుంటుంది.

రావు రమేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

చాలా బాగా అనిపించింది. మా కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఆయన చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా నటుడిగా ఆయకి ఇంకా రెస్పెక్ట్ ని తీసుకొస్తుందని నమ్ముతున్నాను.

సినిమాలో మీ రోల్ కోసం చెప్పండి?

నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను నాన్న ఒకే ఇంట్లో బ్యాచిలర్స్ గా బ్రతుకుతుంటాం. మమల్ని ఎవరూ పండగలకి పబ్బాలకి పిలవరు. కలిసి తాగిపోడిపోయే తండ్రి కొడుకులంగా కనిపిస్తాం. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు వుంటాయి. చాలా ఫన్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. మజాకా క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్. లాఫ్ రైడ్ గా వుంటుంది.

లియోన్ జేమ్స్ సంగీతం కోసం చెప్పండి?

లియోన్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. తన మ్యూజిక్ ఈ సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొస్తుంది. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కావాలని చెప్పాను. అయితే పాటల్ని జనాల్లోకి తీసుకెళ్ళే సమయం దొరకలేదు. అయినప్పటికీ బేబమ్మ, సోమ్మసిల్లి పోతున్నావే పాటలు జనాల్లోకి ఫాస్ట్ గా వెళుతున్నాయి. సినిమా రిలీజ్ తరవాత రీచ్ మరింతా పెరుగుతుంది.

30వ మైల్ స్టోన్ చేరుకోవడం ఎలా అనిపిస్తోంది ?

15 ఏళ్లలో ముఫ్ఫై సినిమాలు. ఇది వెరీ ఇంట్రస్టింగ్ ఎడ్వంచరస్ జర్నీ. నేను ప్రేమించిన వృత్తికి పూర్తి అంకిత భావంతో నా కుటుంబం కంటే సినిమాకి ఎక్కువ ప్రాధాన్య ఇస్తూ ముందుకు వెళుతున్నాను. ఈ ప్రయాణంలో మంచి కథలని, ఎంతో మంది కొత్త దర్శకులని, న్యూ ట్యాలెంట్ ని పరిచయం చేశాననే ఆనందం వుంది.

మీకు డ్రీమ్ రోల్ కానీ డ్రీం ప్రాజెక్ట్ లాంటివి ఉన్నాయా?

నాకు పిరియాడిక్ సినిమాలు ఇష్టం. రాబిన్ హుడ్ లాంటి సినిమా చేయాలని వుంది. రాబిన్ హుడ్ కథని ఫాంటసీ ఎలిమెంట్ తో చేయాలనే కోరిక ఎప్పటినుంచో వుంది.

అన్షు గారిని తీసుకోవాలనే ఛాయిస్ ఎవరిది ?

డైరెక్టర్, ప్రసన్న గారిది. నేను సంగీత గారు లాంటి యాక్టర్ అనుకున్నాను. అయితే డైరెక్టర్, ప్రసన్న మంచి ఆలోచన చెప్పారు. అసలు అన్షు లాంటి అమ్మాయిని రావు రమేష్ గారు ఎలా ప్రేమిస్తారు ? అక్కడే ఇందులో కామెడీ పండుతుందని చెప్పారు. అదే అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది.

హీరోయిన్ రీతూ వర్మ కోసం చెప్పండి

రీతు ఈ సినిమాకి ఒక ఫ్రెష్ నెస్ యాడ్ చేసింది. తనకి ఇలాంటి సినిమాలు కొత్త. మా క్యారెక్టర్స్ చాలా బ్యూటీఫుల్ గా వచ్చాయి.

మీ డైరెక్టర్ కోసం చెప్పండి

త్రినాథ్ రావు గారు నాకు ఎప్పటినుంచో ఇష్టం. ఆయన ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం బ్యుటీఫుల్ ఫిల్మ్. అప్పటి నుంచి ఆయన నాకు ఇష్టం. ఆ కథని ఇప్పుడు చెప్పినా జనం చూస్తారు. త్రినాథ్ గారి సినిమా గ్రామర్ తెలుసు. సీన్ ని ఎలా తీస్తే పండుతుందో తెలిసిన డైరెక్టర్. అందుకే వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారని భావిస్తున్నాను.

మీ ప్రొడ్యూసర్ కోసం చెప్పండి?

రాజేష్, అనిల్ గారు అంటే నాకు హోం ప్రొడక్షన్. ఒకరు అన్నయ్య, మరొకరు ఫ్రెండ్ లా వుంటారు. చాలా పాజిటివ్ గా కలసి పని చేస్తాం.

దళపతి విజయ్ కొడుకుతో సినిమా చేస్తున్నారు.. దాని కోసం చెప్పండి

షూటింగ్ స్టార్ట్ అయ్యింది. చాలా మంచి సినిమా ఇది. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్ టైనర్. సినిమా కోసం సంజయ్ గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. అలాంటి ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు తమిళ్ బైలింగ్వల్.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి

సంజయ్ సినిమా నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఓ సిరిస్ వుంది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ 3 రాబోతోంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు