ఇంటర్వ్యూ : దర్శకుడు ప్రశాంత్ వర్మ – “జాంబీ రెడ్డి” రీమేడ్ ఆఫర్ వస్తే ఏంటో అనుకున్నా..

ఇంటర్వ్యూ : దర్శకుడు ప్రశాంత్ వర్మ – “జాంబీ రెడ్డి” రీమేడ్ ఆఫర్ వస్తే ఏంటో అనుకున్నా..

Published on Feb 4, 2021 5:46 PM IST

తన మొట్ట మొదటి సినిమా “అ!” తోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. అలాగే తన రెండో సినిమా “కల్కి”తో కూడా మంచి మార్కులు వేసుకొని ఇపుడు మన తెలుగులో ఇంతకు ముందు ఎప్పుడు రాని జాంబీ కాన్సెప్ట్ తో “జాంబీ రెడ్డి” అనే సినిమాతో వస్తున్నాడు. మరి ఈ సందర్భంగా ఈ దర్శకుడు నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాం. తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

జాంబీ సినిమాలు అంటే చాలా కంపేరిజన్ ఉంటుంది మరి ఇదెలా డిఫరెంట్ గా ఉంటుంది?

ఇపుడు లవ్ స్టోరీ అనేది ఎలా అయితే జానరో జాంబీ కూడా ఒక జానర్ ఇందులో మన నేటివిటీకి తగ్గట్టుగా తెలుగు సినిమాల్లో కనిపించే సిచుయేషన్స్ తో మన స్టోరీతో కంప్లీట్ గా తీసా. హాలీవుడ్ ఇప్పటికే జాంబీ సినిమాలు తీసిన వాళ్ళకి కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది. అన్ని సినిమాలు చూసి దీనికి పోలిక లేకుండా ఈ సినిమా ఉంటుంది.

పెద్ద హీరో అయితే ఇంకా బాగుండేది అన్న ఫీల్ వచ్చి ఉంటుంది కదా..

పెద్ద హీరో అయితే పెద్ద మార్కెట్ రీచ్ కూడా ఉంటుంది. కానీ దానికి రెండు సంవత్సరాలు కూడా పట్టేది ఏమో..కానీ నేను త్వరగా చేసెయ్యాలి అనుకున్నా సో మంచి యాక్టర్ తేజ కూడా సరిపోతాడు అనిపించి తనతో తీసాను.

జాంబీలో ఫ్యాక్షన్ పెట్టడానికి కారణం ఏంటి?

అదే మన తెలుగుదనంలా ఒక తెలియని విషయాన్నీ తెలిసిన విషయానికి కనెక్ట్ చేసి చెప్తే ఈజీగా ఉంటుంది. ఇలా త్రివిక్రమ్ గారు అలా ఫాలో అవుతారు అనిపిస్తుంది. తన సినిమాల్లో మహాభారతం, భాగవతంతో కలిపి చెప్తూ ఉంటారు. అలా నేను జనానికి అర్ధమయ్యేలా చేద్దామనుకొని చేసాను.

తేజ కోసం స్క్రిప్ట్ రాశారా? రాసాక తేజాని అనుకున్నారా?

ఇది ఎనిమిదేళ్ల కితమే అనుకున్నాను జాంబీలు రాయలసీమ రావడం. కానీ ఇప్పుడు క్విక్ గా చేద్దాం అనుకున్నాను మా ప్రొడ్యూసర్ ఎంత త్వరగా పూర్తి చేస్తే మంచిది అన్నారు అంతా రెడీగా ఉంది మార్కెట్ కోసం అప్పుడు ఏం ఆలోచించలేదు అలా సినిమా స్టార్ట్ చేసేసాం.

ఈ టైటిల్ అనౌన్స్ చేసినపుడు ఇండస్ట్రీ నుంచి మీకొచ్చిన రెస్పాన్స్ ఏంటి?

చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇలాంటి జానర్ మేము చేద్దాం అనుకున్నాము కనై అర్ధం కాదేమో అని వదిలేశామని హా గుడ్ నైస్ అని కొందరు ఇంకొంతమంది అయితే ఆ చూద్దాంలే..అర్ధం అవ్వాలి కదా మేకప్ లు ఎలా వస్తాయో అని అన్నారు కానీ ట్రైలర్ వచ్చాక అప్పుడు వాళ్లంతా అన్నారు యూ అచీవ్డ్ ఇట్ అని..

లాక్ డౌన్ లో షూట్ ఎలా అనిపించింది.?

లాక్ డౌన్ లో కాదు లాక్ డౌన్ తీసినప్పుడే స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా మాది. ఇద్దరు ముగ్గురు తో ఉన్న సీన్స్ నే ముందు షూట్ చేశాను. అలా ఒక్కో వారం గ్యాప్ తీసుకొని చేసాం అందుకే ఇంత లేట్ అయ్యింది లేదంటే ఎప్పుడో మే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది.

జాంబీ రెడ్డి టైటిల్ వివాదం పై చెప్పండి..

ఆ టైం లో చాలానే బెదింపులు వచ్చాయి..(నవ్వుతూ) నిజానికి ఈ టైటిల్ రాయలసీమ ప్రాంతం జరిగింది కాబట్టి పెట్టాం. అలాగే ఈ టైటిల్ అలా పెడితే తప్ప పవర్ ఫుల్ గా ఉండదు అనిపించింది. అందుకే వేరే టైటిల్ ఏం అనుకోకుండా ఇది పెట్టాం. ఆ వివాదం సమయంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వారే ఈ సినిమాకు ఎంత ఇంపార్టెంటో చూపించా అంతే.

సమంతాకు ఈ స్క్రిప్ట్ చెప్పారని టాక్ వచ్చింది.?

అది జాంబీ రెడ్డి స్క్రిప్ట్ కాదు వేరేది..పిచ్చ క్రేజీ స్క్రిప్ట్ అది మేమిద్దరం ఆ స్క్రిప్ట్ నమ్మామ్. కానీ ప్రొడ్యూసర్ దొరకలేదు. అదే మొన్న సమంతా గారు కూడా అడిగారు.

మంచి హిట్టయితే ఇంటెర్నేషన్ లెవెల్లో డబ్బింగ్ ప్లాన్స్ ఎమన్నా ఉన్నాయా?

ఉన్నాయండి. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యినప్పుడే హిందీలో రీమేక్ కు ఆఫర్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ కాకుండా రీమేడ్ ఆఫర్ ఏంటి నవ్వుతారు ఎవరన్నా అని అనుకున్నా, కానీ చాలా చేంజెస్ చేసి చెయ్యొచ్చని పాజిబుల్స్ చెప్పారు.

పాన్ ఇండియన్ లెవెల్ స్క్రిప్ట్స్ ఉన్నాయా?

డెఫినెట్ గా యెస్ అండి. నా దగ్గర పాన్ ఇండియన్ లెవెల్ కథలు కూడా ఉన్నాయ్. జాంబీ రెడ్డి కూడా అలాంటిదే. ఇది కనుక హిట్టయ్యి మంచి పేరు తెస్తే ఖచ్చితంగా సీక్వెల్ పాన్ ఇండియన్ లెవెల్లో ఉంటుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్ లు ఏంటి.?స్టార్ హీరోస్ తో కూడా ఉన్నాయా?

స్టార్ హీరోస్ తో కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా కొత్త జానర్ సినిమా కూడా ఉంది. ఇంకా నాకు పర్సనల్ గా ఒక ప్రాజెక్ట్ జోత్త జానర్ తో ఉంది. మంచి కమర్షియల్ ప్రాజెక్ట్ శంకర్ గారు చేస్తారు కదా కొత్త కథను కమెర్షియల్ ఎలిమెంట్స్ తో అలా చేద్దాం అనుకుంటున్నా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు