ఇంటర్వ్యూ : వైష్ణ‌వ్‌ తేజ్ – ఎన్టీఆర్ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరచిపోలేను.!

ఇంటర్వ్యూ : వైష్ణ‌వ్‌ తేజ్ – ఎన్టీఆర్ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరచిపోలేను.!

Published on Feb 8, 2021 3:35 PM IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు బుచ్చిబాబు సానాను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా హీరో వైష్ణ‌వ్‌ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

 

మీరు హీరో అవ్వాలని ముందే అనుకున్నారా ? అసలు చిన్నప్పుడు మీరు ఏమి అవ్వాలనుకున్నారు ?

హీరో అవ్వాలని అయితే ఎప్పుడూ అనుకోలేదు. పెరుగుతున్న క్రమంలో నటనలోకి వచ్చాను. నేను మొదట వ్యోమగామి అవ్వాలని, అలాగే కొన్నాళ్ళు సైన్యంలో చేరాలని ఇలా ఉండేవి నా ఆలోచనలు. కొన్నాళ్ళు పాటు విఎఫెక్స్ కూడా నేర్చుకోవాలనుకున్నాను. ఇలా చాలా చేయాలనుకున్నాను. అయితే, నా గ్రాడ్యుయేషన్ తరువాత, నేను బరువు తగ్గడం మొదలుపెట్టాను, ఆ క్రమంలో నాకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. నాకు ఉప్పెన కథ బాగా నచ్చింది.

 

ఉప్పెన కథ మీకు నచ్చాకా సినిమా చేయాలి అనే నిర్ణయం పూర్తిగా మీదేనా ?

మా మామయ్య చిరంజీవిగారును సంప్రదించాను, ఇలా ఈ సినిమా గురించి ఆయనకు వివరించాను. ఆయనే నన్ను పూర్తిగా ప్రోత్సహించారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను.

 

మీ అరంగేట్రం పై పవన్ కళ్యాణ్ స్పందన ఏమిటి?

నేను సినిమాలనే కెరీర్ గా ఎంచుకున్నానని తెలిసి, ఆయన సంతోషంగా ఫీల్ అయ్యారు. పవన్ మావయ్య ఉప్పెన ట్రైలర్‌ను చూశారు. ఆయనకు బాగా నచ్చింది. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉంటాయి, ఇక ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు, మేము ఆయనకు సినిమాను చూపిస్తాము.

 

ఈ సినిమాలో ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించింది?

కథ అండి. అద్భుతంగా అనిపించింది. ఈ కథ నా వద్దకు వచ్చినప్పుడు ఇంత గొప్ప సినిమా అవుతుందని నాకు ఖచ్చితంగా తెలియదు. నిజానికి నేను అప్పట్లో చాలా సందేహాస్పదంగా ఉన్నాను. ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు నాకు చాలా సహాయపడ్డారు. చిరంజీవిగారు కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

మీ మొదటి సినిమాలో మీ ప్రదర్శన కోసం ఎలాంటి సన్నాహాలు చేశారు ?

నేను పరిశ్రమలోకి రావడానికి ముందు నటనలో శిక్షణ తీసుకున్నాను. నా పాత్ర కోసం, నేను ఒక జాలరిలా కనిపించడానికి, అచ్చం నా బాడీ లాంగ్వేజ్ ను కూడా అలాగే మార్చుకొవడానికి ప్రాక్టీస్ చేశాను. మాకు 40 రోజులు వర్క్‌షాప్‌లు కూడా జరిగాయి. ప్రీ-ప్రొడక్షన్ కంటే, నేను సెట్స్‌పై చాలా నేర్చుకున్నాను.

 

మీ చిత్రం విడుదల ఆలస్యం గురించి?

మనందరికీ తెలిసిందే, కరోనా కాలం చాలా కఠినమైనది. కాబట్టి నేను సినిమా విడుదల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మా మేకర్స్ అద్భుతంగా విడుదల చేస్తారని నాకు మొదటి నుండి నమ్మకం ఉంది.

 

విజయ్ సేతుపతితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది ?

ఆయన ఆశీర్వాదం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఆయన చాలా నిజాయితీగల నటుడు, నేను ఆయన నుండి చాల నేర్చుకున్నాను. అన్నింటికన్నా, నేను విజయ్ సర్ ప్రవర్తనకు అభిమానిని అయ్యాను.ఆయన ఎప్పుడూ మానిటర్‌ను చూడడు,

 

సినిమా చూసిన తర్వాత చిరంజీవి స్పందన గురించి?

ఈ చిత్రంలో నా నటన గురించి ఆయన ఏమంటాడో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూసాను. ఆయన సినిమా చూసిన క్షణం, “సూపర్ గా చేశావ్ రా’ అన్నారు. అది నా జీవితంలో నాకు దక్కిన ఉత్తమ అభినందన. ఆయనకి సినిమా నచ్చింది కాబట్టి, ప్రేక్షకులు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందని నా అభిప్రాయం.

 

మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?

నేను ఒక యాక్షన్ సినిమా ప్రేమికుడిని. మెగా హీరోల యాక్షన్ చిత్రాలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ల సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. నేను విజయవంతమైతే, సరైన సమయం వచ్చినప్పుడు అలాంటి సినిమాలు చేయాలని ఆశ.

 

ఎన్టీఆర్ తో మీ అనుబంధం గురించి?

ఆయన నన్ను ప్రోత్సహించిన విధానాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను రామ్ చరణ్ ఇంట్లో ఎన్టీఆర్ అన్నను కలిశాను. అప్పటి నుండి, ఆయన నన్ను తన సొంత సోదరుడిగానే ప్రేమించారు. ఆయన ఎల్లప్పుడూ నన్ను పిలిచి, నా షూట్ మరియు నా భవిష్యత్తు సినిమాల గురించి ఆరా తీస్తారు. అలాగే మంచు మనోజ్ కూడా నిజంగా నాకు దగ్గరగా ఉన్న మరొక నటుడు. ఆయన నన్ను ప్రోత్సహించే విధానం కూడా గొప్పది.

 

దర్శకుడు బుచ్చి బాబు గురించి?

ఆయన నాకు ఒక గురువు, స్నేహితుడు, సోదరుడు. నేను ఉత్తమమైన రీతిలో నటించేలా చాల జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు