ఇంటర్వ్యూ: అజయ్- ఆచార్య లో నా రోల్ అలా ఉంటుంది..!

ఇంటర్వ్యూ: అజయ్- ఆచార్య లో నా రోల్ అలా ఉంటుంది..!

Published on Apr 25, 2020 1:59 PM IST

 

నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ సీరియస్ విలన్ గా సెటిల్ అయ్యారు అజయ్. భారీకాయం కలిగిన అజయ్ విక్రమార్కుడు సినిమాలో టిట్లాగా ఎంత భయపెట్టాడో తెలిసిందే. ఇక సారాయి వీర్రాజు, దిక్కులు చూడకు రామయ్యా సినిమాలలో హీరోగా కూడా చేయడం జరిగింది. మన లాక్ డౌన్ ఇంటర్వూస్ సిరీస్ లో భాగంగా యాక్టర్ అజయ్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ విశేషాలేమిటో మీరే తెలుసుకోండి…

 

లాక్ డౌన్ కి ముందు మీ ప్రాజెక్ట్స్ ఏమిటీ?

చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను. అలాగే రెండు వెబ్ సిరీస్ కొరకు సైన్ చేశాను. త్వరలో వాటిని ప్రకటిస్తాను.

 

ఆచార్య సినిమాలో మీ రోల్ ఏమిటీ?
దీని గురించి ఎక్కువ చెప్ప కూడదు. ఐతే చాలా కాలం తరువాత నేను ఓ ప్రాధాన్యం ఉన్న పాజిటివ్ రోల్ చేస్తున్నాను. ఆ పాత్ర నాకు మంచి పేరుతెస్తుందని నమ్ముతున్నాను.

 

చిరంజీవి గారితో మీకున్న అనుభం ఏమిటీ?

చెవితే ఎవరూ నమ్మరు..ఇన్నేళ్ల కెరీర్ లో నేను చిరంజీవి గారిని కలిసింది కేవలం ఒక్కసారి మాత్రమే. ఆచార్య మూవీ సెట్స్ లో కలవడం రెండో సారి. ఇక ఆయన నా గురించి నా చిత్రాల గురించి మాట్లాడుతుంటే గాలిలో తేలిన భావన కలిగింది.

 

మీ నేపథ్యం ఏమిటీ?

మాది విజయవాడ, పుట్టి పెరిగింది అక్కడే. ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో వదిలేశాను. ఐ సి డబ్ల్యూ ఏ కూడా ట్రై చేసి వదిలేశాను. సినిమాలో చిన్న చిన్న పాత్రలు ఏదో వ్యాపకం కోసం చేస్తున్న సమయంలో విక్రమార్కుడు తరువాత సినిమా సీరియస్ కెరీర్ గా మారింది. ఇలా చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ళ ప్రస్థానం సాగింది.

 

కెరీర్ లో బెస్ట్ కంప్లీమెంట్?

ఇష్క్ మూవీ విడుదల తరువాత రాజమౌళి గారు, రమా గారు ఫోన్ చేసి బాగా చేశావ్ అని అభినందించారు. రాజమౌళి గారు నిజానికి ఎవరిని పెద్దగా పొగడరు. అలాంటిది ఆయన నా నటన గురించి కాంప్లిమెంట్ ఇచ్చే సరికి చాలా ఆనందం వేసింది .

 

మీకు విలన్ గా అవకాశాలు తగ్గాయనుకుంటా?

అంటే నేను ఇప్పుడు మధ్య వయసులో ఉన్నాను, దాని వలన అటు యంగ్ విలన్ పాత్రలు చేయలేను, ఇటు ఏజ్డ్ విలన్ పాత్రలకు పనికి రాను. అందుకే అవకాశాలు తగ్గాయని నా భావన.

 

ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ గురించి మీ అభిప్రాయం?

భవిష్యత్ అంతా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ దే. రాబోయే రెండు మూడేళ్లలో అందరూ స్టార్ హీరోలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు చేస్తారు. ఒక నటుడిగా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేయవచ్చు. నేను కూడా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను.

 

పరిశ్రమలో మీకు దగ్గరి స్నేహితులు?

ఎన్టీఆర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయనతో గడపడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆయనతో పాటు నితిన్, నారా రోహిత్, కొరటాల శివ, విక్రమ్ కుమార్, శ్రీకాంత్ మంచి మిత్రులు.

 

చివరిగా..లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు?

నటుడిగా మిగతా సమయాలలో కుటుంబంతో గడపడానికి అసలు సమయం దొరకదు. ఈ లాక్ డౌన్ వలన ఇంట్లో ఉంటూ భర్యా పిల్లలతో కొంత సమయం గడిపే అవకాశం దొరికింది. ఇక నచ్చిన మూవీస్ చూస్తున్నాను. మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7 చాల బాగుంది. వీటితో పాటు ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తున్నాను. ఇక వంట విషయంలో నేను చాలా వీక్, అందుకే దాని జోలికి వెళ్లడం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు