సంక్రాంతి చిత్రం అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ మనసు దోచిన బుట్టబొమ్మగా నటించింది హీరోయిన్ పూజా హెగ్డే. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే పాత్రికేయులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు..ఎలా అనిపిస్తుంది?
చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ‘అల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు. సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం వలన డైలాగ్స్ మాడ్యులేషన్ పై అవగాహన పెరుగుతుంది.
తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్ ని ఎవరినైనా పెట్టుకున్నారా?
తెలుగు నేరుకోవడానికి కోచ్ ఎవరినీ పెట్టుకోలేదు.కాకపోతే నేను పని చేసే హీరోలు, నా మేనేజర్ మరియు స్టాఫ్ తో నేను తెలుగులోనే మాట్లాడుతాను.అందుకే తెలుగు అలవాటైంది. ఇలాంటి ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే నాకు కొంచెం భయం వేస్తుంటుంది.
త్రివిక్రమ్ గారిని గురూజీ అంటున్నారు, కారణం?
నేను పని చేసిన డైరెక్టర్లలో త్రివిక్రమ్ గారు చాలాసైలెంట్ డైరెక్టర్. మిగతా దర్శకులు గట్టిగా కోపంతో అరుస్తుంటే నాకు భయం వేసేది. సెట్లో డైరెక్టర్ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపిస్తే, మన స్ట్రెస్ తగ్గిపోతుంది. తాను పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని అని తెలిసినా, ఆయన అలా ప్రవర్తించరు.
అల వైకుంఠపురంలో సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
అల వైకుంఠపురంలో మూవీలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా ఇష్టం. ఆ రెండు సన్నివేశాలు నేను బాగా ఎంజాయ్ చేశాను.
టాలీవుడ్ లో చాల మంది హీరోలతో పనిచేసినా… బన్నీ ఫేవరేట్ కావడానికి కారణం?
నేను అతని వర్క్ కు అభిమానిని . అతనితో కలిసి పనిచెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తాను.అందుకే బన్నీ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రభాస్ కూడా చాలా నైస్ పర్సన్. ఆయనతో పని చేయడం కూడా ఆహ్లాదంగా ఉంటుంది.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఏమైనా నటిస్తున్నారా?
ఒకటి అలాంటి స్క్రిప్ట్ వచ్చింది కానీ సబ్జెక్టు నచ్చకపోవడంతో చేయలేదు. నచ్చిన సబ్జెట్ దొరికితే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి ఎప్పుడూ సిద్దమే. నటిగా మనల్ని మనం నిరూపించుకొనే అవకాశం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వలన దొరుకుతుంది.