ఇంటర్వ్యూ : అల్లరి నరేష్- మహేష్ నన్ను సర్ అని పిలిచేవారు..!

ఇంటర్వ్యూ : అల్లరి నరేష్- మహేష్ నన్ను సర్ అని పిలిచేవారు..!

Published on Apr 22, 2020 12:43 PM IST

 

టాలీవుడ్ లో కామెడీ హీరో అంటే అల్లరి నరేషే. రాజేంద్రప్రసాద్,అలీ, నరేష్ వంటి సీనియర్ కామెడీ హీరోలు ప్రాభవం కోల్పోయాక, వెండితెర హాస్య ప్రియుల దాహం తీర్చిన హీరో అల్లరి నరేష్. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న ఈ వి వి సత్యనారాయణ గారి చిన్నకుమారుడైన నరేష్, నటుడు దర్శకుడు రవిబాబు డైరెక్షన్ లో 2002 లో వచ్చిన అల్లరి చిత్రంతో వెండితెరకు పరిచమయ్యారు. అభినయం, ఆహార్యంలో ఓ పర్ఫెక్ట్ కామెడీ హీరో అని మొదటి సినిమాతోనే నిరూపించుకున్నారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న అల్లరి నరేష్ 18ఏళ్ల కెరీర్ లో 50 పైగా చిత్రాలలో నటించి సూపర్ అనిపించుకున్నారు. మరి ఈ అల్లరి హీరోని ఇంటర్వ్యూ చేసిన 123తెలుగు.కామ్ అనేక ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీకోసం…

 

లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న కార్మికులకు అండగా నిలిచిన మొదటి వ్యక్తి మీరు, ఆలోచన ఎలా వచ్చింది?

లొక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా నాకు నా ప్రస్తుత చిత్రం నాంది కి పనిచేస్తున్న వర్కర్స్ గుర్తుకు వచ్చారు. వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి వారి అకౌంట్స్ నేరుగా డబ్బులు జమ చేయమని కోరాను. అది నా బాధ్యతగా భావించి చేశాను.

 

ఈ లాక్ డౌన్ సమయంలో ఎలా గడుపుతున్నారు?
సాధారణంగా నేను ఎక్కువగా బయటికి వెళ్లే వ్యక్తిని కాదు. ప్రస్తుతం షూటింగ్స్ కూడా లేకపోవడంతో నా పాపతో ఆడుకోవడం, వంటలో మా ఆవిడకు సాయం చేయడం చేస్తున్నాను. అలాగే కొన్ని ఇంగ్లీష్ మరియు కొరియన్ వెబ్ సిరీస్ లు చూస్తున్నాను.

 

మహర్షి తరువాత స్పందన ఎలా ఉంది?

మహర్షి సినిమాలో నేను చేసిన పాత్రకు అద్భుతమైన రెస్పాస్ వచ్చింది. అలాంటి పాత్రలో నన్ను చూసి ప్రేక్షకులు నరేష్ ఇలాంటి పాత్ర కూడా చేయగలడా అని అనుకున్నారు. దర్శకులు ఇలాంటి పాత్రలతో నరేష్ తలుపు తట్టడం ఖాయం అనుకున్నారందరూ. ఐతే అలా జరగలేదు.. అలాగే వచ్చిన ప్రతి సినిమా చేస్తూ పోలేం.

 

మహేష్ తో నటించడం ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

మహేష్ తో కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది . అందరికి మహేష్ మంచి నటుడిగానే తెలుసు, నాకు మాత్రం వ్యక్తిగా కూడా తెలుసు. మహేష్ నన్ను సర్ అని పిలుస్తూ ఉండేవారు. ఆయన అలా పిస్తున్నప్పుడల్లా నాకు అదోలా అనిపించేది. లైట్ బాయ్ నుండి డైరెక్టర్ వరకు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు ఆయన. మహేష్ నిజంగా రియల్ సూపర్ స్టార్.

 

నాంది మూవీ గురించి చెప్పండి?

నాంది మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో నాలో కొత్త కోణం చూస్తారు. అల్లరి నరేష్ 2.0 వర్షన్ నాంది సినిమాలో చూస్తారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, మళ్ళీ నన్ను ఫార్మ్ లోకి తెస్తుందని గట్టి నమ్మకం ఉంది.

 

కెరీర్ల్ లో ఫెయిల్యూర్స్ ఎలా తీసుకుంటారు?

మా నాన్నగారు నాకు నేర్పింది ఒకటే…’నీ ఫెయిల్యూర్ ఎదుటివారిపై రుద్దకు’ అని. కారణం ఏదైనా నా సినిమాలు వైఫల్యం చెందడంలో నా పాత్ర కూడా ఉంది. ఇకపై నేను జాగ్రత్త పడతాను. చేసేవి తక్కువ సినిమాలైనా క్వాలిటీ ఉన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాను.
 

మీ నాన్నగారైన ఈవివి బ్రతికుంటే మీ కెరీర్ మరోలా ఉండేదన్న భావన మీకుందా?

వ్యక్తిగతంగా ఓకె…కానీ వృత్తి పరంగా కాదు. ఎందుకంటే మానాన్న గారు నా సినిమాల విషయంలో జోక్యం చేసుకొనే వారు కాదు. కొన్ని చెత్త సినిమాలకు నేను సైన్ చేస్తున్నప్పటికీ ఆయన కలుగ చేసుకునేవారు కాదు. సక్సెస్ ఫుల్ మూవీస్ కి మరియు ఫెయిల్యూర్ మూవీస్ కి మధ్య తేడా నేను స్వయంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడేవారు.

 

ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

అవును.. ప్రపంచంతో పాటు మనము మారాలి. నా కంఫర్ట్ జోన్ మరియు రెగ్యులర్ రోల్స్ నుండి బయటికి వచ్చి భిన్నమైన రోల్స్ చేయాలని ఉంది. ఐతే ఇండస్ట్రీలో నేను సీనియర్ హీరోని కావడం వలన నాకు డార్క్ షేడ్ రోల్స్ ఎవరూ ఆఫర్ చేయడం లేదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తానని చెవుతున్నాను.

 

ఈ జెనరేషన్ లో మిమ్ముల్ని బాగా ఇన్స్పైర్ చేసిన నటులు?
హీరో ఆయుష్మాన్ ఖురానా చేసే పాత్రలు, ఎంచుకునే జోనర్స్ చాల భిన్నంగా వేటికవే వైవిధ్యంగా ఉంటాయి. ఇక మురళి శర్మ, రావు రమేష్ నటనను బాగా ఇష్టపడతాను.

 

మరి ఎప్పటికైనా నటించాలనుకుంటున్న దర్శకుడు?
నా కెరీర్ లో చాలా మంది దర్శకులతో నటించాను, కానీ పూరి జగన్నాధ్ తో నటించలేదు. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఇక నా ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్ మణిరత్నం .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు