“థలపతి69” మూవీ పై లేటెస్ట్ బజ్!


కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లాంగ్ రన్ లో 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ హీరో తదుపరి హెచ్. వినోత్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా థలపతి69 అనే టైటిల్ ను పెట్టారు.

ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం పై సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. విజయ్ ను ప్రేక్షకుల ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో, అలా ఈ చిత్రం ఉండనుంది అని సమాచారం. తేరి చిత్రం తరహాలో ఉండనుంది అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Exit mobile version